ఇప్పటినుంచి మరి కొద్ది గంటల పాటు ప్రపంచ దేశాల అందరి కన్ను భారత్ పైనే ఉంటుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన చంద్రయాన్-2 అంతరిక్ష మిషన్ మరికొద్ది సేపట్లో సఫలమా లేక విఫలమా అని తేలిపోతుంది. అయితే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఏ దేశం ధైర్యం చేయని పనిని మొట్టమొదటిసారిగా భారతదేశం చేస్తోంది. ఇప్పటివరకు చంద్రుని మీద అడుగు పెట్టిన ప్రతి ఒక్క దేశం ఉత్తర దృవం నుంచే కాలు మోపాయి. కానీ మొట్టమొదటిసారి చంద్రయాన్ అతి క్లిష్టమైన దక్షిణ ధ్రువం మీదుగా చంద్రుడి పైన అడుగుపెట్టబోతోంది. అయితే అసలు చంద్రాయాన్-2 లక్ష్యం ఏమిటి? ఈ స్పేస్ మిషన్ ప్రపంచానికి కొత్తగా చెప్పబోయేది ఏమిటి?

ఇప్పటి ప్రపంచంలో అన్ని అంతరిక్ష ఏజెన్సీస్ కలిపి 38 సార్లు చంద్రుడు పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించగా వాటిలో సఫలమైంది కేవలం 52 శాతమే. అయితే ఇంత తక్కువ సక్సెస్ రేటు ఉన్న ఈ ప్రక్రియలో అది కాకుండా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించిన దక్షిణ ధ్రువం వైపు నుండే చంద్రయాన్-2 చంద్రుడి మీద కాలు మోపడానికి ముఖ్య కారణం ఏమిటి?

భూమి చరిత్ర గురించి మనకి బాగా విస్తృతమైన జ్ఞానాన్ని అందించగలిగేది చంద్రుడు మాత్రమే. అందులోనూ చంద్రుడి దక్షిణ దృవం దగ్గరి ప్రాంతం అంతా నీడ గా ఉంటుంది. కాబట్టి వాటి పైన అత్యధిక మొత్తంలో నీరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే భూమికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు పరిశీలించడానికి అవసరమైన శిలాజ సమాచారం దక్షిణ ధ్రువం వైపు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉత్తర ధ్రువం వైపే పరిశోధన చేసిన వారందరికీ చంద్రుడి గురించి సగమే తెలుసు. కానీ దక్షిణ ధ్రువం వైపు ఉండే చల్లని ప్రదేశాలలో అసలు చంద్రుడు ఎలా ఉద్భవించాడు... ఎలా ఏర్పడ్డాడు... తర్వాత ఎలాంటి ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి వంటి పూర్తి సమాచారం ఒక నిఘంటువులా చంద్రయాన్-2 మనకు అందిస్తుంది.

చంద్రుడు పైన జరిపే మిషన్లు మరియు పరిశోధనల్లో ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమం. అమెరికా, రష్యా మరియు చైనా తరువాత చంద్రుడి ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ కానున్న దేశం మనదే. ఇప్పుడు చంద్రయాన్-2 అందించే సమాచారం కేవలం భారతదేశానికే కాకుండా మొత్తం మానవ జాతికే ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఒక భారతీయుడిగా ఈ మిషన్ దిగ్విజయంగా పూర్తి కావాలని మనసారా కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: