Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 1:03 pm IST

Menu &Sections

Search

చంద్రయాన్ 2 అసలు అక్కడే ఎందుకు ల్యాండ్ అయ్యింది.... ఎలా పనిచేస్తుందో చూడండి.. అతి ముక్యమైన ఆ ఆరు అంశాలు ఇవే

 చంద్రయాన్ 2 అసలు అక్కడే ఎందుకు ల్యాండ్ అయ్యింది.... ఎలా పనిచేస్తుందో చూడండి.. అతి ముక్యమైన ఆ ఆరు అంశాలు ఇవే
చంద్రయాన్ 2 అసలు అక్కడే ఎందుకు ల్యాండ్ అయ్యింది.... ఎలా పనిచేస్తుందో చూడండి.. అతి ముక్యమైన ఆ ఆరు అంశాలు ఇవే
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 
చంద్రయాన్-2 భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ  చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టిన రెండవ యాత్రకు ఉపయోగిస్తున్న నౌక. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి, 14 రోజుల పాటు చంద్ర ఉపరితలంపై తిరుగుతూ, వివిధ ప్రయోగాలు చేసేందుకు అవసరమైన సాధన సంపత్తి ఈ నౌకలో అమర్చారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి రోవరును పంపుతున్న తొలి దేశం భారతే. ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు కాగా ఇందులో వాహక నౌకకు రూ. 375 కోట్లు అయింది. చంద్రయాన్-2లో మూడు పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటరు. ఇది చంద్రుడి కక్ష్యలో తిరుగుతూంటుంది.

మరొకటి ల్యాండరు. చంద్రయాన్-2 నిర్ధారించిన చంద్రుని కక్ష్యలోకి చేరాక, రోవరు దీనినుండి విడివడి, చంద్రుడి వైపు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై నిదానంగా దిగుతుంది. తరువాత, ఈ ల్యాండరు నుండి రోవరు అనే మూడో పరికరం బయటకు వస్తుంది. దీనికి 6 చక్రాలున్నాయి. అది చంద్రుడి మీద కదులుతూ ఉపరితలాన్ని పరిశీలిస్తూ, పరిశోధిస్తుంది. చంద్రయాన్-2 లో ఇస్రో తాను రూపొందించిన 13 శాస్త్ర పరిశోధన పరికరాలతో పాటు నాసా వారి లేజరు రెట్రోరిఫ్లెక్టరును కూడా అమర్చింది. 

ఈ నౌక సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం పైన ఈ  తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది.  చంద్రుడిపై  లాండర్ విక్రమ్ దిగగానే ఈ  రోవర్ నుండి  ప్రగ్యాన్ వేరవుతింది. ఇలా బయటకొచ్చిన ప్రగ్యాన్ 14 రోజులపాటు చంద్రుడిపై అనేక పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ఈ మిషన్ ప్రారంభమైన 48 రోజుల తరువాత ఈ లాండర్, రోవర్లు చంద్రుడిపై దిగనున్నాయి. మొదట 2019 జూలై 15 న జరపాలని తలపెట్టిన ప్రయోగాన్ని సాంకేతిక కారణాల వలన ప్రయోగానికి 56 నిముషాల ముందు రద్దు చేసారు. క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిచేసిన తరువాత, 2019 జూలై 22 న మధ్యాహ్నం 2:43 గంటలకు చంద్రయాన్-2 ను జిఎస్‌ఎల్‌వి ఎమ్‌కె3 ఎమ్1 వాహనం ద్వారా ప్రయోగించి భూకక్ష్యలో ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. 
 
అసలు ఈ  చంద్రయాన్ గురించి పూర్తిగా తెలియాలి అంటే మీరు ఈ 6 విషయాల గురించి తెలుసుకోవాలి...   
1. లాంచ్ వెహికల్ 
2. లాండర్ విక్రమ్ 
3. రోవర్ ప్రగ్యాన్ 
4. ఆర్బిటర్ 
5. లాండింగ్ 
6. ఎందుకు దక్షిణ ధృవంపైనే దిగడం


1. లాంచ్ వెహికల్:
జి ఎస్ ఎల్ వి మాక్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 చంద్రుడిపైకి బయల్దేరింది. భారత దేశ బాహుబలిగా పేర్కొనే ఈ రాకెట్ లో టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడ్డవి. 

2.లాండర్  విక్రమ్:
దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరిట విక్రమ్ అని పేరు పెట్టారు.  దాదాపు 1500 కిలోల బరువుండే ఈ లాండర్ లోనే రోవర్ ప్రగ్యాన్ ఇమిడి ఉంటుంది. ఈ లాండర్ చంద్రుడిపై 14 రోజులపాటు నిరాటంకంగా పనిచేస్తుంది. ఆర్బిటర్, రోవర్లతో నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది ఈ లాండర్ విక్రమ్. ఈ లాండర్ నేరుగా చంద్రుడిపై క్రాష్ లాండింగ్ చేస్తూ దిగకుండా సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది.విక్రమ్‌లో 800 న్యూటన్ సామర్థ్యం గల 5 ప్రధాన ఇంజన్లు, 50 న్యూటన్ల సామర్థ్యం గల 8 యాటిట్యూడ్‌ను నియంత్రించే 8 ఇంజన్లు ఉన్నాయి.  

3. రోవర్ ప్రగ్యాన్ : 
దాదాపు 27కిలోల బరువుండే ఈ రోవర్ ప్రగ్యాన్ చంద్రుడిపై తిరుగాడుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. దీన్ని ఇస్రో రూపొందించింది.  6 చక్రాలతో తిరుగాడే ఈ రోవర్ కేవలం సౌర శక్తిపైనా మాత్రమే ఆధారపడి పనిచేస్తుంది. 500 మీటర్ల పాటు ఈ రోవర్ చంద్రుడి ఉపరితలం పైన తిరగాడుతుంది. రోవర్ సేకరించిన సమాచారాన్ని విక్రమ్ కి అందజేస్తే, విక్రమ్ దాన్ని భూమికి తిరిగి పంపిస్తుంది. ప్రజ్ఞాన్ ఒక చంద్ర పగలు కాలం అంటే భూమిపై 14 రోజులు పాటు పని చేస్తుంది. చంద్రుని రాత్రి సమయంలో ఉండే గడ్దకట్టించే శీతల  స్థితిని అందులోని ఎలక్ట్రానిక్స్ తట్టుకోలేవు. అయితే, దానిలో ఆటోమాటిగ్గా నిద్రించే 
వ్యవస్థ అలాగే  మేలుకునే పవర్ వ్యవస్థ ఉంది. చంద్ర రాత్రి వేళ పవర్ వ్యవస్థ నిద్రిస్తుంది. రాత్రి ముగిసి, పగలు మొదలు కాగానే మళ్ళీ  పవర్ వ్యవస్థ మేలుకుంటుంది. అంటే  ప్రజ్ఞాన్ ఒకసారి ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి 14 రోజులు పడుతుంది. 

4. ఆర్బిటర్: 
 ఈ ఆర్బిటర్  చంద్రుడిపై 100x100 కిలోమీటర్ల కక్ష్యలో ఏడాది  పాటు పరిభ్రమిస్తుంది. ఈ సమయంలో చంద్రుడిని ప్రతి క్షణం ఒక కంట కనిపెడుతూ ఫోటోలు తీస్తూ, భూమి మీదికి సమాచారాన్నిపంపిస్తుంటుంది.

5. లాండింగ్ : 
ఇస్రో నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ల్యాండర్‌లోని థ్రాటుల్ ఏబుల్ ఇంజిన్లు మండుతూ.. ల్యాండర్ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ చంద్రయాన్-2 వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ సమయంలో దాని వేగం గంటకు 6,120 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. సరిగ్గా చంద్రుడిపై విక్రమ్ కాలు మోపే వేళలలో అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో వ్యోమనౌకకు అమర్చబడిన సోలార్ ప్లేట్ల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. రెండు చంద్రబిలాల మధ్య ఎగుడు దిగుళ్లు లేని సమతలంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్‌కు అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా ద్వారా శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు.
ఒకవేళ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యంకాకపోతే 67.7 డిగ్రీల దిక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. ఈ 15 నిమిషాల ప్రక్రియ చంద్రయాన్-2కే ఆయువుపట్టు. అందుకే దీనిని ఇస్రో ఛైర్మన్ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్‌గా అభివర్ణించారు. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్లే, చంద్రునికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్రుని 35*100 మీటర్ల కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్.. మామూలుగా చంద్రుడి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా జరక్కుండా ఉండేందుకు గాను .. శాస్త్రవేత్తలు విక్రమ్‌లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ నెమ్మదిగా దిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా వ్యోమనౌకను చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉంది. 

6. దక్షిణ ధృవంపైన్నే లాండింగ్ ఎందుకు ...
దక్షిణ ధృవంపై దిగడానికి ప్రముఖంగా రెండు కారణాలున్నాయి. మొదటిది సౌరశక్తి అధికంగా లభించడం. ఇలా సౌరశక్తి ఈ ప్రాంతంలో అధికంగా ఉండడం వల్ల ఈ పరికరాలు పనిచేయడానికి వేరే ఇంధనాన్నో లేదా బ్యాటరీలనో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. మరో విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గుట్టలు రాళ్లు తక్కువగా ఉండడం వల్ల సాఫ్ట్ లాండింగ్ కి అనువైన ప్రదేశం తేలికగా లభ్యమవుతుంది. రెండో కారణమేంటంటే సాంకేతికంగా ఈ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో నీటి ఆనవాళ్లు, ఖనిజాలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా గనుక చూసుకుంటే,చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్  చరిత్ర సృష్టించబోతోంది .
 Chandrayaan 2 Why did it land in there .... how it works
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలీవుడ్ హీరోలపై వాణికపూర్ సంచలన వ్యాఖ్యలు..
ముద్ద ఉన్నా, లేకున్నా కూడా వీరికి ముద్దు మాత్రం ఉండాలట..
కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రకుల్ ప్రీత్..
కళ్ళతో కైపెక్కిస్తున్న కత్రినా కైఫ్ అందాలు.. పిచ్చెక్కిస్తున్నాయి..
సినిమాలలో రొమాన్స్ ఎక్కువగా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..
వయసులో తనకన్నా చిన్న వారిని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఎవరంటే..
అమ్మాయిలకోసం బస్స్టాప్ లో ఎదురు చూసే వాడిని అంటున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..
విజయ్ దేవరకొండ లవ్ లో ఫెయిల్ అయ్యాడట..షాక్లో ఫ్యాన్స్..
భయంకరంగా ఉన్న ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారా? తింటే ఎం జరుగుతుందో తెలుసా..
రోజా మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది.. ఈ సారి ఏమైందో..
సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి.. దానికి పరిష్కారం ఇలా చేస్తే బెటర్..!
సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మళ్ళీ వాయిదా అసలు ఉంటుందా? లేదా? మెగా ఫ్యాన్స్ ఫైర్..
ఆ హీరో నాలుగు నిమిషాలకు ఐదు కోట్లు తీసుకుంటున్నాడట.. ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో..
చిరుతో పని చేసినందుకు, ఆయననుండి నేను ఇదే నేర్చుకున్న.. కన్నడ హీరో కామెంట్స్..
అమ్మాయిల తల్లి దండ్రులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే..
కాజల్ గురించి ప్రభాస్ ఏమన్నాడో చూడండి...
అక్కడ కరెంట్ పోతే చాలా కష్టమట.. అది ఎక్కడంటే..
జుట్టుకు ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
ఇండియాలో నేను ఎప్పుడు బట్టలు కొనను.. స్టార్ హీరోయిన్
భారతీయ అమ్మాయిల మనసు ఇలా ఉంటుందట.. నిజమేనా?
తెలుగులో గెస్ట్ రోల్ చేసిన హిందీ సినీ తారలు వీరే..
సాహూ తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రభాస్ ఏమన్నాడంటే..
నాని కోరిక గ్యాంగ్ లీడర్ తో ఇంకా తీరలేదట..
వయ్యారాల నడుముతో సెగలు పుట్టిస్తున్న ఆ స్టారో హీరోయిన్ ఎవరో చుడండి..
సినిమాలకు దూరమైన తెలుగు హీరోలు వీరే..
కత్తిలా మారిన చిరు హీరోయిన్ అందాలు మాములుగా లేవుగా..
అస్సాం టీ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే ..
హన్సిక తో రొమాన్స్ చేసి దొరికి పోయిన యువ హీరో ఎవరో తెలుసా..
గ్యాంగ్ లీడర్ ను వాల్మీకి బీట్ చేస్తుందా..
మీకు పొట్ట ఉందా.. వీటిని ఇలా తినండి పొట్ట మాయమవుతుంది..
డోర్స్ ఓపెన్ లో ఉన్నాయ్ ఛాయిస్ ఈజ్ యూర్స్ అంటూ మహేష్ కి ముచ్చెమటలు పట్టించిన నాగార్జున
సైరా కోసం మమ్మల్ని పూర్తిగా వాడుకొని ఇప్పుడు పట్టించుకోవడంలేదు...న్యాయం చేయండి ధర్నా చేసిన కుటుంబ సభ్యులు
వాల్మీకి కోసం కదిలిరానున్న కోబ్రా ...
ఈ వారం బిగ్ బాస్ ఇవ్వబోతున్న బిగ్ సర్ప్రైజ్ ఇదేనా..!
నల్లమల కోసం కదిలిన సెలెబ్రెటీలు
బిగ్ బాస్ హౌస్లో 55 వ రోజు ఏంజరిగింది ..... మహేష్ ఎలిమినేట్?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.