ఇస్రో చేపట్టిన ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి.  ఒకటి రెండు మిన్నగా కొన్ని మిగతావన్నీ కూడా సక్సెస్ అయ్యాయి.  అలా సక్సెస్ అయిన వాటిల్లో చంద్రయాన్ 1 కూడా ఒకటి.  చంద్రయాన్ 1 మొదటిసారితోనే విజయం సాధించింది.  నీటి జాడలు ఉన్నట్టు కనుగొనడంలో చంద్రయాన్ 2 ను ప్రయోగం చేసింది.  ఈ ప్రయోగం చివరి వరకు సక్సెస్ అయ్యింది.  చివరి క్షణాల్లో ప్రయోగం విఫలం కావడంతో డీలా పడింది.

ఈ ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు నిరాశ చెందారు.  వారి కళ్లలో నిరాశను చూసిన ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడారు.  శాస్త్రవేత్తల్లో మనోబలం నింపేందుకు ప్రయత్నం చేశారు.  మీరు చేసిన ప్రయోగాలు అమోఘం అని కితాబిచ్చారు.  ప్రతి ఒక్కరు మీనుంచి స్ఫూర్తి పొందారని, మీరు చేస్తున్న పనులు ప్రతి ఒక్కరిని మెప్పించే విధంగా ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి రెడీ కావాలని అన్నారు. 


ఒకటి రెండు విఫలమైతే దాని నుంచి నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని, మీ ప్రయత్నాలు వృధా కావని అన్నారు. ఒకచోట విఫలమైతే మరో చోట ప్రయోగం చేసి సక్సెస్ సాధించాలని, శాస్త్రవేత్తల్లో ఆ సత్తా ఉందని మోడీ తెలిపారు.   దేశానికీ స్పేస్ శాస్త్రవేత్తలు ఓ ప్రేరణగా నిలిచారని, 128 కోట్లమంది ప్రజలు మీకు అండగా ఉంటారని అన్నారు.  


అనంతరం , మోడీ వెళ్లే సమయంలో శివన్ మిషన్ ఫెయిల్ అయినందుకు కంటతడి పెట్టుకున్నాడు.  దీంతో మోడీ ఇస్రో చైర్మన్ శివన్ హత్తుకొని ధైర్యం చెప్పారు.  నిరాశ చెందవద్దని, ప్రయోగం మళ్ళి చేద్దామని అన్నారు.  భవిష్యత్తులో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయాలని మనోధైర్యాన్ని ఇచ్చారు.  ప్రతి ఒక్కరు మీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: