ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగానికి చంద్రుని దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకుంది.. కారణాలు ఏంటి.. ఆ ధృవంపై ప్రయోగాలు చేయాలని ఎందుకు భావించింది చూద్దాం.  దక్షిణ ధృవంపైనే ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.  ఈ దృవంలో ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టలేదు.  అక్కడి పరిస్థితులు చంద్రుని మీద ఉండే మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.  

 

అక్కడి గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా తక్కువ.  పైగా అక్కడ వెలుతురూ లేదు.  ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ వెలుగు లేకపోవడంతో.. ఉష్ణోగ్రత మైనస్ 248 డిగ్రీలుగా ఉన్నది.  అంతటి తీవ్రమైన చలి ఉంటుంది కాబట్టి నీరు ఉండే అవకాశం ఉన్నది.  అదీ ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉండొచ్చు.  ఇస్రో అంచనా ప్రకారం పదికోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చని అంటున్నారు.  

 

ఈ స్థాయిలో నీరు ఉంటె దానిని వినియోగంలోకి తెచ్చుకోవచ్చు.  దీంతో అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకోవచ్చు.  చంద్రుని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే.. దక్షిణ ధృవంలో రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి.  ల్యాండర్ దిగడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉన్నది.  అంతేకాదు, అక్కడ సిల్వర్ తో పాటు ఇతర మూలకాలు ఎక్కువగా ఉన్నాయి.  

 

గతంలో అమెరికా వంటి దేశాలు దక్షిణ ధృవంపై అడుగుపెట్టాలని అనుకున్న కుదర్లేదు.  అమెరికా ప్రయోగించిన ఓ ఉపగ్రహం చంద్రుని దక్షిణ దృవంపై 100 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది.  చివరి వరకు వచ్చి 2.1 కిలోమీటర్ల వరకు వెళ్లిన మొదటి ఉపగ్రహం చంద్రయాన్ 2.  ఒకవేళ చంద్రయాన్ 2 అనుకున్నట్టుగా దిగి, సంకేతాలను పంపి ఉన్నట్లయితే.. అక్కడి అసలు విషయాలు ఏంటి అన్నది ఈపాటికి బయటకు వచ్చేవి. ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 స్పూర్తితో 2024 లో అమెరికా ఆర్టెమిస్ అనే వ్యామోగామీ నౌకను చంద్రుని దక్షిణ ధృవం మీదకు పంపాలని చూస్తున్నది.  ఐరోపా కూడా అదే విధంగా ఓ రోవర్ ను పంపించాలని చూస్తున్నది.  చంద్రయాన్ 2 ఇచ్చిన స్ఫూర్తి ఇది.

మరింత సమాచారం తెలుసుకోండి: