Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 2:27 pm IST

Menu &Sections

Search

అసలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అంటే ఏమిటి

అసలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అంటే ఏమిటి
అసలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అంటే ఏమిటి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇంటర్నెట్ ద్వారా లభించే ఆన్ లైన్ వేదికను సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ అంటున్నారు. దీని ద్వారా వివిధ వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు ఏర్పడి సోషల్ నెట్ వర్క్ లుగా మారతాయి. ఇవి ఒకే రకమైన అభిరుచులు కలిగిన వ్యక్తుల మధ్య ఏర్పడవచ్చు. లేదా ఒకే ప్రయోజనాలు, కార్యక్రమాలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తులు, బృందాల మధ్య ఏర్పడేవి కావచ్చు లేదా నిజ జీవితంలో స్నేహితులు, బంధువుల మధ్య ఏర్పడేవి కావచ్చు. ఈ సోషల్ వెబ్ సైట్లలో ప్రతీ వ్యక్తీ తన పేరు, వివరాలు, వృత్తి, ఆసక్తి, అభిరుచులతో కూడిన ప్రొఫైల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా స్నేహితులతోనూ, కొత్తగా మిత్రులయ్యే వారితోనూ ఆన్ లైన్లో సంభాషించవచ్చు, బంధాలు పెంచుకోవచ్చు.


సోషల్ మీడియా అప్లికేషన్లు పలురకాలుగా విస్తరిస్తున్నాయి. ఇంటర్నెట్ మ్యాగజైన్లు, ఫోరంలు, వెబ్ బ్లాగులు, మైక్రో బ్లాగులు, వికీస్, పాడ్ కాస్ట్ లు, బొమ్మలు, వీడియోలు, రేటింగ్, సోషల్ బుక్ మార్కెటింగ్ సైట్లు మొదలైనవి సోషల్ మీడియాకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో సోషల్ మీడియా


సమాచార సాంకేతిక రంగాలకు ప్రాధాన్యతనిచ్చి సాంకేతిక పరిజ్ఞానాన్ని శరవేగంగా నేర్చుకొని, ప్రపంచదేశాలకు విస్తృత సేవలందిస్తూ, ఈ రంగంలో మొదటి వరుస దేశాల్లో స్థానం సంపాదించుకుంది భారతదేశం. అలాగే అంతర్జాలాన్ని వేగంగా అందుకుని దాని ప్రయోజనాల్ని పూర్తిగా వినియోగించుకోవడంతోపాటు పలు కొత్త ఆవిష్కరణలకు భారతీయులు దారివేశారు. ఈ రంగంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లు అందుబాటులోకిరావడంతో పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అతి స్వల్పకాలంలోనే మనదేశంలో, ముఖ్యంగా యువతలో ఈ సైట్లు అమితమైన ప్రజాదరణను పొందాయి.  మనదేశంలో సోషల్ మీడియా ఏటా 100 శాతం వృద్ధి చెందుతోంది.  భారత్, ఇతర ప్రపంచ దేశాలలో సంప్రదాయ మీడియాకి సోషల్ మీడియా పెనుసవాలు విసురుతోంది. పరస్పరం మాట్లాడుకునే పాత తరహా పద్ధతిని సోషల్ మీడియా దెబ్బతీస్తున్నదనే విమర్శలు ఉన్నప్పటికీ కొత్త కొత్త పద్ధతుల్లో ఈ లోటును పూడుస్తుంది.


సోషల్ నెట్ వర్కింగ్, సోషల్ మీడియా వృద్ధికి దోహదం చేసిన ప్రముఖ సాధనాలలో మొబైల్ ఫోన్ ఒకటి. నీల్సన్ నివేదిక ప్రకారం సోషల్ మీడియాతో అనుసంధానానికి చాలా మంది స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ లను వాడుతున్నారు. ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా, ఎలా కావాలన్నా సోషల్ మీడియా వాడుకునే స్వేచ్ఛ లభించింది. పట్టణ ప్రాంత భారతీయులలో విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.  ప్రతి నలుగురిలో ముగ్గురు సోషల్ మీడియాను వాడుతున్నారు. మొబైల్ ద్వారా సోషల్ నెట్ వర్క్ సగటు వినియోగంలో భారతదేశం ముందువరుసలో ఉంది.


టెలివిజన్, పత్రికల స్థాయిలో సోషల్ మీడియా ఏ మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందనే అంశంపై ఇప్పటికి స్పష్టత రాలేదు. ఇంటర్నెట్ అందుబాటు, వినియోగంలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాలు ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా పెరగుతూనే ఉంది. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఈ విషయంలో తీవ్రమైన అంతరాలు ఉండడం సోషల్ మీడియా వినియోగానికి ఆటంకంగా మారుతోంది.


Why social networking sites are so engaging
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఐబీపీఎస్ 12,075 క్లర్క్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల
గద్దలకొండ గణేష్ ప్రమోషన్స్‌లో బిగ్ బాస్ హౌజ్‌కు వచ్చిన మాస్ వరుణ్ తేజ్
బెంగళూరులో ఆఖరి టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ 1-1
బిగ్ బాస్ సీజన్ 3 తొమ్మిదో వారం హిమజ ఎలిమినేట్.. పునర్నవి, వితికా హ్యాపీ
నేడే ఫ్లిప్ కార్ట్ లో Moto E6s సేల్ అతి చవకైన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్
వివాదంలో 'సైరా నరసింహారెడ్డి' చిత్ర యూనిట్
రెండో రోజు రికార్డ్స్ బద్దలు చేసిన గద్దలకొండ గణేష్ కలెక్షన్
డాటర్స్‌ డే సందర్బంగా మహేష్ బాబు కూతురు సితారపై ఎమోషనల్ ట్వీట్
శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో రాహుల్ ఫేక్ ఎలిమినేషన్‌ డ్రామాతో ట్విస్ట్ ఇచ్చిన నాగ్
విరాట్ మొదటి స్థానం పై కన్నేసిన ఓపెనర్ రోహిత్ శర్మ
నీదెంత..?? నాదెంత..?
ఈ ప్రభుత్వమే ప్రధాన కారణం: చంద్రబాబు
పబ్ జీ కి పోటీ గా వస్తోంది..
అలా అనేవారు మూర్ఖులు: హరీష్ శంకర్
సుమధుర గాన సుమనోహరుడు..రాహుల్ వెల్లాల్
జానూ.. నువ్వు టెన్షన్ పడకు మేరీ జాన్..
ఇది సర్కార్ రిజల్ట్..
హంస కాదు ఇది హాట్ హింస..
జేసీ కి త్రిశూల దండన..
అంతా జగన్ ఇష్టమే : జీవీయల్
సివిల్స్ పరీక్షలు షురూ..
ఆలియా భట్.. మంచిదే..కాని...??
మెగాస్టార్ రేంజ్ అంటే ఇది..
ఏం చేసేది లేదు..చేసే ఆలోచన కూడా లేదు..రామ్ చరణ్ తేజ్
ఇది మా సినిమా కుటుంబం..
గోపీచంద్ 28వ చిత్రం భారీ బడ్జెట్ మూవీ.. ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌నే నమ్ముకున్న మాచో హీరో
బిగ్ బాస్ కాలేజ్ టాస్క్ లో గాసిప్ అంటే ఎలా ఉంటుందంటే.. దుప్పట్లో వితికా, వరుణ్‌లు ఏం చేశారో చెప్తున్న శివజ్యోతి
మొహాలి వేదికలో జరిగిన టీ20ల్లో విరాట్ కోహ్లీ టాప్.. రోహిత్ రికార్డ్ బ్రేక్
రెండోసారి అమ్మమ్మ అయిన ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్ రవీనా టాండన్
హార్దిక్‌ పాండ్యాకు వేలు చూపిస్తూ రోహిత్ శర్మ సీరియస్ వార్నింగ్
YS జగన్ సర్కారుకు షాక్.. అధికార లాంఛనాలను తిరస్కరించిన కోడెల కుటుంబం సభ్యులు
సినిమాల్లోకి రావడం వల్ల నా చిరకాల కోరిక నెరవేరలేదు: సమంత
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.