రైలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసే.  ప్రతి ఒక్కరు రైలు ఎక్కే ఉంటారు. రైలు ఎక్కని వారంటూ ఉండరేయో. రెగ్యూలర్ గా రైలు ప్రయాణం చేయకున్నా..ఎప్పుడో ఓ సారి ఎక్కే ఉంటారు. అయితే అస‌లు విషయం మాత్రం అది కాదండి…ఎందుకంటే ఆ ప్ర‌శ్న‌కు ఇంకా కొన‌సాగింపు ఉంది. అదేమిటంటే… రైలు ఎక్క‌డానికి స్టేష‌న్‌కు వెళ్లిన‌ప్పుడు రైలు బోగీల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా..? ప్ర‌ధానంగా రైలు చివ‌రి పెట్టె వెనుక భాగాన్ని ప‌రిశీలించారా? ప‌రిశీలించాం, చూశాం, అయితే ఏమిటి అంటారా? ఆ, అయితే అక్క‌డే ఆగండి. రైలు చివ‌రి పెట్టె వెనుక భాగంలో ఆంగ్ల అక్ష‌రం X అని పెద్ద‌గా రాసి ఉంటుంది. దాన్ని ఎప్పుడైనా చూశారా?  ఇప్పుడు దాని గురించే మేం చెప్ప‌బోయేది. అస‌లు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో మీకు తెలుసా? అయితే ఎందుకో తెలుసుకోండి!

 

రైలు బోగీల్లో చివ‌రి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివ‌రిది అని అర్థం. అంతేకాదు ఆ X అక్ష‌రం కిందే ఓ ఎర్ర‌ని లైటు, దాని ప‌క్క‌నే LV అనే ఓ బోర్డు కూడా త‌గిలించ‌బ‌డి ఉంటుంది. ఇవన్నీ X అక్ష‌రం లాగే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటి వ‌ల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివ‌రి పెట్టెగా ప‌రిగ‌ణిస్తారు. అయితే X అక్ష‌రం ప‌గటి స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డితే, ఎర్ర‌ని లైటు రాత్రి పూట ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టెల‌తోనే వెళ్తుంద‌ని అర్థం చేసుకుంటారు. ఒక వేళ రైలు చివ‌రి పెట్టెకు ఈ అక్ష‌రాలు ఏవీ లేక‌పోతే అది ప్ర‌మాద‌వ‌శాత్తూ కొన్ని బోగీలు లేకుండానే న‌డుస్తుంద‌ని తెలుసుకుంటారు. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై సంబంధిత అధికారుల‌కు తెలియ‌జేస్తారు. సో, రైలు చివ‌రి పెట్టె వెనుక ఉన్న అక్ష‌రాల మ‌త‌ల‌బు అద‌న్న‌మాట‌


మరింత సమాచారం తెలుసుకోండి: