ప్ర‌స్తుత స‌మాజంలో ఫేస్‌బుక్‌, వాట్స‌ప్‌కు ఎంత క్రేజ్‌ఉందో ఇన్‌స్ట్రోగ్రామ్‌కు కూడా అంతే క్రేజ్ ఉంది. ఫొటోలు షేర్‌ చేయడానికి ఫేస్‌బుక్‌ ఉపయోగించే కాలం ఎప్పుడో మారిపోయింది. ఫొటోల విషయానికి వస్తే ఇప్పుడు ఇన్‌ స్టాగ్రామ్‌దే రాజ్యం. కానీ ఫేస్‌బుక్‌లో ఉండి, ఇన్‌ స్టాగ్రామ్‌లో లేని ప్రధాన ఫీచర్‌ ఫొటోలు సేవ్‌ చేసుకోవడం. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు. కానీ వాటిని సేవ్‌ చేసుకునేందుకు ఒక దారి ఉంది. అదేంటంటే..


ముందుగా మీ ప్రొఫైల్‌పై క్లిక్‌ చేయండి. ఇప్పుడు కుడివైపు చివర ఉండే మూడు గీతల ఐకాన్‌పై క్లిక్‌ చేయండి. ఓపెన్‌ అయిన మెనూలో కింద సెట్టింగ్స్‌ అని కనిపిస్తుంది. ఆ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అక్కడ అకౌంట్‌పై క్లిక్‌ చేయండి. తర్వాత మీకు ఒక మెనూబార్‌ ఓపెన్‌ అవుతుంది. మీరు ఐవోఎస్‌ వినియోగించే వారైతే ఒరిజినల్‌ ఫొటోస్‌, ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే ఒరిజినల్‌ పోస్ట్స్‌ మీద క్లిక్‌ చేయండి. అక్కడ కనిపించే మూడు ఆప్షన్లనూ ఎనేబుల్‌ చేసుకోండి.


అంతే.. ఇంక మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసే ప్రతిఫొటో, వీడియో ఆటోమేటిక్‌గా మీ ఫోన్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌ ఫోల్డర్‌లో సేవ్‌ అవుతాయి. అయితే వేరే వాళ్ల ఫొటోలు మాత్రం ఫేస్‌బుక్‌లో లాగా సింపుల్‌గా సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు. ఈ ఆప్షన్‌ కేవలం మీ ఫొటోలకు మాత్రమే పరిమితం అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: