టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మొబైల్ రంగంలో మరింత దూకుడుగా ఉన్నాయి సదరు కంపెనీలు. అధునాతన ఫీచర్స్ ఉన్న ఫోన్ ఒక్కటి చేతిలో ఉంటే చాలు మొత్తం ప్రపంచం అంతా మీ గుప్పెట్లో ఉన్నట్లే అన్నట్టుగా మారిపోయింది. దాంతో రోజుకో  ఫీచర్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి మొబైల్ కంపెనీలు. ఈ విషయంలో వీవో మొబైల్ కంపెనీ రెండడుగులు ముందే ఉంది.

 

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే సెల్ఫి కెమెరా ఎలా ఉంది అంటూ సెర్చ్ చేసి తీసుకుంటున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. దాంతో సెల్ఫి కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్ లకి క్రేజ్ పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్ని వినియోగదారుల అభిరుచుని దృష్టిలో పెట్టుకున్న వీవో కంపెనీ ఏకంగా డ్యుయల్ సెల్ఫి కెమెరా  కలిగిన ఫోన్ అందుబాటులోకి తెచ్చింది. వీవో వీ 17 పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్స్ కూడా కళ్ళు చెదిరేలా ఉన్నాయని అంటున్నారు టెక్ నిపుణులు.

 

ఈ ఫోన్ కి రెండు సేల్ఫీ కెమెరాలతో పాటు నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. దీని ధర రూ 29,900

గా నిర్ధారించారు. ఫ్లిప్కర్ట్ లో అందుబాటులో ఈ మొబైల్ అందుబాటులో ఉంది.

డిస్ప్లే  : 6.4

ర్యామ్ : 8జీబీ

ఫ్రంట్ సెల్ఫి కెమెరాలు : 2

బ్యాక్ కెమెరాలు : 4

బ్యాటరీ సామర్ధం  : 4100Mah

ఇంటర్నల్ స్టోరేజ్ : 128జీబీ

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: