ఈ కాలంలో యువత సెల్లులేని జీవితానికి సున్నా మార్కులు వేస్తున్నారు.మరికొందరైతే సెల్లు ఇంట్లో వాళ్లు కొనివ్వడం లేదని ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇంతగా ఆకర్షించే ఈ సెల్లులోని మాయ ఏంటో ఎవరైన పక్కాగా చెబుతారా.సరేలే మీరాలోచించండి కాని ఇప్పుడు మార్కెట్లోకి ఓ కొత్తసెల్లు వచ్చింది దానికి కీపాడ్స్ కూడా వుండవట.మనుషులు మారుతున్న కొద్ది మేం ఎందుకు మారద్దని అవి కూడా వయ్యారంగా కొత్త కొత్త టెక్నాలజీలతో మనముందుకు వస్తున్నాయి ఇక ఫోన్లో ఎన్ని ఎక్కువ ఫీచర్లుంటే అంత గొప్ప.నిజమే కానీ వాటిని యాక్సెస్‌ చేయడానికి ఎన్ని తక్కువ బటన్లుంటే ఆ ఫోన్‌ అంత గ్రేట్‌ అనిపించుకుంటుంది.



మొదట్లో ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లోనూ ఎన్నెన్నో బటన్లూ స్విచ్‌లూ ఉండేవి.తక్కువ బటన్స్‌తో డివైజ్‌ని తయారు చేయడంలో యాపిల్‌ ఐపాడ్‌ పేరు ముందు చెప్పుకోవాలి.ఆ తరవాత యాపిల్‌ ఐఫోన్‌ వచ్చి,టచ్‌ స్క్రీన్‌తో స్విచ్‌లన్నిటికీ సమాధానం చెప్పింది.అప్పటినుంచీ హీరోయిన్లకు బట్టలు తగ్గినట్లుగా,స్మార్ట్‌ ఫోన్స్‌లో బటన్స్‌ తగ్గిపోయాయి.రాను రాను కొన్ని ఫోన్స్‌లో హోమ్‌ బటన్‌ లేకుండా పోయింది.ఇప్పుడు వాల్యూమ్‌ బటన్స్‌ కూడా మాయమైపోతున్నాయి.ఈ ట్రెండ్‌లో,ఇప్పుడొక ఫోన్‌ బటన్‌-ఫ్రీగా వస్తోంది.ఇందులో కూడా హోమ్‌ బటన్‌గానీ,బ్యాక్‌ బటన్‌ గానీ,వాల్యూమ్‌ బటన్స్‌ గానీ ఏవీ ఉండవు.ఎలాంటి బటనూ లేకుండా ఫోన్‌ని యాక్సెస్‌ చేయడం ఎలా అంటే అది పెద్ద కష్టమేం కాదు.



పవర్‌ఫుల్‌ టచ్‌ స్క్రీన్లూ,ఆన్‌స్క్రీన్‌ ఫింగర్‌ప్రింట్లూ వచ్చేశాక ఇది విషయమే కాదు.మరి అందుకే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ విశిష్టమైన రీతిలో ఒక ఫోన్‌ తయారవుతోంది.అదే షియామీ మిక్స్‌ ఆల్ఫా..మిక్స్‌ సీరీస్‌లో మిక్స్‌ 3 తరవాత వస్తున్న ఈ ఫోన్లో,బటన్స్‌ లేకపోవడం మాత్రమే కాదు,ఫోన్‌ స్క్రీన్‌ అనేది ముందు భాగం ఎడ్జ్‌ని దాటి పోయి వెనక వరకూ వెళ్లిపోవడం దీంట్లో మరో స్పెషాలిటీ ఇక అతి త్వరలోనే ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రకటనని మనం వినబోతున్నాం ఇక ఫోన్‌తో మరింతగా ఎంజాయ్ చేయడానికి రెడిగా వుండండి..



మరింత సమాచారం తెలుసుకోండి: