మనసు మొబైల్ నెంబర్లు పది అంకెలు ఉంటాయి. అయితే ఈ పడి అంకెలు తమకు   నచ్చినట్టుగా ఉండడానికి కొంతమంది ఎన్నో డబ్బులు వెచ్చించి మొబైల్ నెంబర్ కొనుకుంటారు. వాటికి ఫాన్సీ నెంబర్ అని పేరు కూడా ఉంది. కొంతమంది ఏ నెంబర్ అయితే ఏంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా...  పోతున్నాయా  అన్నట్టుగా ఉంటారు. అయితే ప్రస్తుతం మనకు ఉన్న  మొబైల్ నెంబర్ లో 7, 8,  9 సిరీస్  నెంబర్ లతో  ఉన్న మొబైల్ నెంబర్ చూసాం. అయితే ఇప్పటి వరకు పది అంకెలు ఉన్న మొబైల్ నెంబర్ ఎప్పుడు 11 అంకెలు కాబోతుంది. మొబైల్ నెంబర్ కు ఉండే 10 నెంబర్లు  పెంచడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుందట. ప్రస్తుతం 10 నెంబర్లతో వివిధ సిరీస్ లో ఉన్న నెంబర్లు ఇంకా 250 కోట్ల మందికి మాత్రమే సేవలు అందించేందుకు అవకాశాలున్నాయట. అందువల్లనే 11 అంకెలతో కొత్త ఫోన్ నెంబర్లు మార్కెట్లోకి తెచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో యోచిస్తుందట . దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

 

 

. 30 సంవత్సరాల తర్వాత ఏర్పడే డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నెంబర్లను 10 అంకెల నుండి 11 అంకెలకు మార్చేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ట్రాయ్  ఆలోచన ప్రకారం ఫోన్ నెంబర్లు పది అంకెలు కాకుండా 11 అంకెలు ఫోన్ నెంబర్లుగా  రానున్నాయి.ఈ మొబైల్ నెంబర్ లో అంకెలు 11 నెంబర్లకు పెంచడంతోపాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా యోచిస్తున్నట్లు.అయితే దీనిపై త్వరలోనే నిర్ణయం  తీసుకోనుందని సమాచారం. అయితే ట్రాయ్  దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: