రోడ్డుపై హడావిడిగా బండి మీద వెళ్తూ ఉంటాం. మధ్యలో ఊహించని విధంగా పోలీసులు అడ్డు వచ్చి బండి పక్కకి తీయమని చెప్పి వారు అడిగిన వివరాలు పత్రాలు మన వద్ద లేకపోతే ఫైన్ కట్టి వెళ్ళమని చెప్తారు. మన వద్ద అంత డబ్బు లేకపోతే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి డబ్బులు ఇచ్చే వరకూ అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చువాల్సి వస్తుంది. పాపం ఇలాంటి పరిస్థితులు ఎన్నో గమనించిన అధికారులు. ఈ ఫైన్ అందుబాటులోకి తెచ్చారు. ఇందులో మనకి ఫైన్ వేయాల్సి వచ్చినప్పుడు కెమెరాతో క్లిక్ మానిపించి వెళ్లి ఈ సేవాలో చెలాన కట్టుకోండి అని చెప్తారు.

 

ఈ క్రమంలో మనకి ఈ సేవా కేంద్రాలకి వెళ్ళడం కుదరక ఆ ఫైన్ పెండింగ్ పడిపోతుంది.అయితే మనం ఎక్కడికి వెళ్ళకుండానే ఆన్లైన్ లో ఈ ట్రాఫిక్ ఫైన్ కట్టుకోవచ్చు. ఈ విషయం తెలిసినా ఆ విధానం తెలియక ఎంతో మంది కాళీ కుదుర్చుకుని మరీ క్యూలో నిలబడి ఫైన్ కట్టి వస్తారు. అందుకే ఆన్లైన్ లో ట్రాఫిక్ ఫైన్ ఎలా కట్టాలో ఒక్క సారి చూద్దాం.

 

ప్రభుత్వానికి చెందిన https://echallan.parivahan.gov.in/ ఈ వెబ్సైటు ని ఓపెన్ చేయగానే చెక్ చెలనా స్టేటస్ అని కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. అందులో మీ వెహికల్ నెంబర్ లేదా చెలనా నెంబర్ ఎంటర్ చేయలి. ఇలా చేయగానే కాప్చర్ అని కనిపిస్తుంది.

 

అందులో వివరాలు ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చెలాన రాసేతప్పుడు మీ వెహికల్ నెంబర్ మీద గాని, లైసెన్స్ నెంబర్ మీద గాని చెలనా రాస్తారు. కాబట్టి అక్కడ ఈ రెండు వివరాలు చెక్ చేసుకోవాలి. ఆ తరువాత చెలనా వివరాలు ఎంటర్ చేయగానే pay now అని కన్పిస్తుంది. మీరు అక్కడ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లో మీ వీలుని బట్టి డబ్బు చెల్లింపు చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: