సెల్ ప్రేమికులకు దిల్ కుష్ అయ్యేవార్త తెస్తుంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ వివో.ఈ మధ్యే వివో జెడ్1ఎక్స్,వివో వీ17 ప్రోలను మార్కెట్లోకి తెచ్చిన వివో ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురానుంది.వివో నుంచి రానున్న ఈ కొత్త ఫోన్ వివో యూ10 రేపు(సెప్టెంబర్ 24) లాంచ్ కానుంది..ఇక వివో మొబైల్ అంటేనే కెమెరాకు పెట్టింది పేరు కాబట్టి దీనికి వెనకవైపు 13 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉండగా, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో 2 కెమెరాలు ఉన్నాయి.ఇక సెల్ఫీ కెమెరా సామర్థ్యం 8 మెగా పిక్సెల్. డిజిటల్ జూమ్,ఆటో ఫ్లాష్,ఫేస్ డిటెక్షన్,టచ్ టు ఫోకస్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది.ఒక్కసారి ఫుల్ గా చార్జ్ పెడితే 12 గంటల పాటు యూట్యూబ్ చూడవచ్చు,



15 గంటల పాటు ఫేస్ బుక్ చూడవచ్చు.7 గంటల పాటు నిరంతరాయంగా PUBG ఆడవచ్చు.దీనితో 18W ఫాస్ట్ చార్జింగ్ అడాప్టర్ ను అందించనున్నారు దీంతో 10 నిమిషాలు చార్జ్ పెడితే..4 గంటల 30 నిమిషాలు నిరంతరాయంగా ఫోన్ మాట్లాడవచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే...ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉపయోగించారు.గ్రాఫిక్స్ అడ్రెన్ 610 కూడా ఉంది.ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.అంతేకాకుండా లైట్ సెన్సార్,ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సెలరో మీటర్ కూడా ఉంది.ఆండ్రాయిడ్ 9.0 Pie ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, వైఫై,బ్లూటూత్ 5.0, జీపీఎస్, VoLTE వంటి ఫీచర్లు ఉన్నాయి.మెమొరీ కార్డు కోసం ఉన్న ప్రత్యేక స్లాట్ లో 256 జీబీ మెమొరీ కార్డు వరకు వేసుకోవచ్చు.



ఇందులో 6.35 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.3:9. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో 81.91 శాతంగా ఉండనుంది. స్క్రీన్ రిజల్యూషన్ 720x1544 పిక్సెల్స్ గా ఉండనుంది. వాటర్ డ్రాప్ నాచ్ తో కూడిన బెజెల్ లెస్ డిస్ ప్లే కూడా ఉంది. ఈ ఫోన్ పొడవు 15.94 సెంటీమీటర్లు కాగా, వెడల్పు 7.67 సెంటీమీటర్లు గానూ, మందం 0.89 సెంటీమీటర్లు గానూ ఉంది. ఇక బరువు వచ్చి 190.5 గ్రాములు. ఎలక్ట్రిక్ బ్లూ, థండర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఇన్ని ఫీచర్స్ అందిస్తున్న దీని ధర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి అనుకుంటున్నారా అదేం లేదులేండి జస్ట్ వివో యూ10 ధర భారతదేశ మార్కెట్లో రూ.11,999గా ఉండనుందని సమాచారం.ఇక 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ నుంచి వేరియంట్లు ప్రారంభం కానున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: