ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచం నడుస్తోంది. అందులోకి ఒకసారి ప్రవేశిస్తే రావడం అంత సులభం కాదు. ఇక యూట్యూబ్‌లో ఇప్పుడు మ‌హిళ హ‌వా న‌డుస్తోంది. మ‌హిళ‌లు యూట్యూబ్‌పై మంచి ప‌ట్టు సాధించారు. వంటల నుంచి చిట్కాల వరకు చెబుతూ బోల్డంత మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకోవడంతోపాటు ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇండియాలో యూట్యూబ్ ఛానెల్స్‌లో మ‌హిళ‌లు అద్భుతంగా రాణిస్తుండ‌డంతో పాటు ల‌క్ష‌ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్ల‌తో దూసుకుపోతున్నారు.


ఇంట్లోనే కూర్చొని చేసుకునే వ‌ర్క్ కావ‌డంతో ల‌క్ష‌లాది రూపాయ‌లు అర్జిస్తున్నారు. క్రియేటివిటీతో మ‌హిళ‌లు చేసే వీడియోల‌కు సబ్‌స్క్రైబర్లు విపరీతంగా పెరిగారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న 120 కిపైగా చానళ్లకు ఏకంగా పదిలక్షల మందికిగా సబ్‌స్క్రైబర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా యూట్యూబ్ వెల్లడించింది. ఇక ఇండియాలో మిలియ‌న్ స‌బ్‌స్కైబ‌ర్లు ఉన్న ఛానెల్స్ సంఖ్య 1200కు పైగా ఉంద‌ని తెలుస్తోంది.


ఇక మ‌హిళ‌ల విష‌యానికి వ‌స్తే 2015లో మహిళా యూట్యూబ్ చానళ్ల సబ్‌స్క్రైబర్లు జీరోగా ఉంటే.. 2016లో ఒక మహిళా యూట్యూబ్ చానల్‌ మిలియన్ సబ్‌స్క్రైబర్లను సాధించిందని, 2017లో ఆ సంఖ్య మూడుగా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 120కు పైగా ఉంది. భార‌త్‌లో అన్ని భాష‌ల్లోనూ మ‌హిళ‌లు ఎక్క‌డెక్క‌డో నుంచి వీడియోలు పోస్ట్ చేసి ల‌క్ష‌లాది రూపాయ‌లు అర్జిస్తున్నారు.


ఇక యూట్యూబ్ అనేది ఇప్పుడు కేవ‌లం ప‌ట్ట‌ణాల అంశం మాత్ర‌మే కాద‌ని.. ప‌ల్లెలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ దూసుకుపోతోంద‌ని రిపోర్టులు చెపుతున్నారు. ఇక భాష‌ల ప‌రంగా చూస్తే తెలుగు, తమిళం, బెంగాళీ, హిందీ, మరాఠీ, మలయాళం తదితర భాషల్లో యూట్యూబ్ వీడియోలు బాగా పాపుల‌ర్ అవుతున్నాయి. ఇక 265 మిలియన్లమంది యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారత్ అవ‌త‌రించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: