టీవీ,అంతర్జాలం,ఫోన్‌లు ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెస్తే..ఫేస్‌బుక్‌ అదే ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టింది.రోజులో ఎంత పని చేసినా..ఏం సాధించినా..ఎంత బాధపడినా. కనీసం 20 నిమిషాల పాటు నాతో గడుపు అంటుందీ మాయాపుస్తకం.అందుకే 2075 వ‌ర‌కు కూడా గూగుల్‌,ఫేస్‌బుక్ మ‌నుగ‌డ‌లోనే ఉంటాయంటున్నారు యాపిల్ స‌హ‌ వ్య‌వ‌స్థాప‌కుడైన స్టీవ్...ఎర్ర బ‌ట‌న్‌, ప‌చ్చ‌ బ‌ట‌న్ మాత్ర‌మే ఉండే ఫీచ‌ర్ ఫోన్ల నుంచి ప్ర‌పంచాన్ని గుప్పిట్లోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ ఫోన్ల వ‌ర‌కు టెక్నాలజీ పరుగులు పెట్టింది. ఇంకా పెడుతూనే వుంది.కాని ఈ టెక్నాలజీల వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని అనర్దాలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.



ఇక ఈ యాప్స్ మనతో చేసే వ్యాపారం ఎలా వుంది అంటే మీ పేజీకి ఇన్ని లైకులు కావాలంటే ఇంత కట్టండి అంటూ,మీ వీడియోకి ఇన్ని హిట్స్‌ వస్తే ఇన్ని డబ్బులిస్తాం అని యూట్యూబ్‌,ఫేస్‌బుక్‌ యాడ్స్‌ మనతో వ్యాపారం చేస్తున్నాయి..ఇచ్చినా తీసుకున్నా వీటి వ్యాపారం అంతా మనుషుల మనసులతోనూ వారి ఇష్టాలతోనే సాగుతుంది.ఒకప్పుడు యూట్యూబ్‌ కూడా గూగుల్‌ సొంతం కాదు.ప్రజల వీడియో అప్‌లోడ్స్‌‌కి జెండా ఊపిన 2005 నాటి ఒక చిన్న సంస్థని గూగుల్‌ సొంతం చేసుకుని,దాన్ని ఇంతలా డెవలప్ చేసింది.ఇప్పుడు తాజాగా ఫేస్‌బుక్‌ కూడా ఓ స్టార్టప్‌ కంపెనీ కొందట.



ఇక ఈ సంస్థ చేసే ప్రాజెక్ట్‌ ఏంటో తెలుసా? మనుషుల ఆలోచనల ఆధారంగా డివైజెస్‌ని పనిచేయించడం ఆ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ఇప్పటికే మేధావులు,సామాజిక శాస్త్రవేత్తలు, మనుషులు ఆలోచనలు చదవాలనుకునే టెక్నాలజీ భవిష్యత్తులో అత్యంత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందని గోలపెడుతున్నారు,ఇలాంటి సంస్థల ప్రయోగాల్ని ఖండిస్తున్నారు.కానీ కోట్లు ఖర్చు పెట్టి ఫేస్‌బుక్‌ లాంటి ప్రముఖ కంపెనీలే ఇలాంటి సంస్థల్ని కొనేస్తుంటే మేధావుల మాటలు పట్టించుకునేది ఎవరు. రాబోయే ఈ ప్రమాదాన్ని అడ్డుకునేది ఎవరు అనే ప్రశ్న మంచి ఆలోచన వున్న ప్రతివారిలో మెదులుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: