భారత మొబైల్ మార్కెట్ లోకి మరొక ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ ఫీచర్స్, చూసి ఖరీదు ఎక్కువే అనుకున్నారు టెక్ నిపుణులు కానీ అందరి అంచనాలు మార్చేస్తూ ఈ ఫోన్ ధరని సదరు కంపెనీ ప్రకటించడంతో నోళ్ళు వెళ్ళబెట్టారు యూజర్స్. ఇంతకీ ఈ ఫోన్ ధర రూ. 7,999. ఈ ఫోన్ ధరని ,ఫీచర్స్ ని హైలెట్ చేస్తూ సదరు కంపెనీ ప్రచారం చేసుకుంటోంది. ఈ ఫోన్ విశేషాలు, ఫీచర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

స్మార్ట్ ఫోన్ తయారీలో వినూత్న ఫందాని ఎంచుకున్న కూల్ ప్యాడ్ అందుకు తగ్గట్టుగా మార్కెట్ ని క్యాచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఫీచర్స్ , ధర చూస్తే ప్రస్తుతం టాప్ కంపెనీలకి గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. cool pad 5 గా మార్కెట్ లోకి విడుదలైన ఈ ఫోన్ లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి.

 

6.2 స్క్రీన్ తో ఫుల్ hd తో ఈ ఫోన్ ఉండటం అది కూడా తక్కువగా ధరకి ఉండటం ఒక విశేషమైతే. 4 జీబీ ర్యామ్ ,64 జీబీ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4000 mah శక్తివంతమైన బ్యాటరీ సామర్ధ్యం కూడా ఉంది. ఇక కెమరా విషయానికి వస్తే వెనుక భాగంలో రెండు కెమెరాలు 13 mp , 2 mp లుగా ఉన్నాయి. ముందు భాగంలో 16 mp సేల్ఫీ కమెరా అందుబాటులో ఉంది.అన్ని స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఫీచర్ అందుబాటులో ఉంచుతూ అన్ని కంపెనీల కంటే కూడా తక్కువ ధరకి ఈ మొబైల్ ప్రవేశ పెట్టడంతో cool pad 5  పై యూజర్స్  ఆసక్తి చూపుతున్నారు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: