టెక్నాలజీ..ఇది రోజురోజుకు మన జీవితాన్ని సుఖమయం చేస్తుంది. అయితే ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం.. అభాగ్యులకు సేవచేయడం.. కష్టాలు తీర్చడం వంటి సేవలు అందిస్తే ఆ టెక్నాలజీకి అసలైన సార్థకత. ఇప్పుడు బ్రెజిల్ లోని ఓ స్టార్టప్ కంపెనీ ఇదే చేస్తోంది. కేవలం ముఖ కవళికలతోనే ఏదైనా యంత్రాన్ని ఆపరేట్ చేసే టెక్నాలజీని రూపొందిస్తోంది.


బ్రెజిల్ కు చెందిన హూబాక్స్ అనే సంస్థ... ఫేషియల్ రికగ్నజైషన్‌ తో పనిచేసే వీల్ చైర్ ను రూపొందించింది. కదల్లేని స్థితిలో ఉండే రోగులు తమ వీల్ చైర్ ను తామే ఆపరేట్ చేసుకునేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.


అంటే మనం కమాండ్ కేవలం ముఖం ద్వారా ఇవ్వొచ్చన్నమాట... ఉదాహరణకు.. చిరునవ్వు నవ్వితే కుర్చీ ముందుకు కదులుతుంది. ఎడమవైపునకు చూస్తే.. ఎడమవైపునకు తిరుగుతుంది. కుడి వైపునకు చూస్తే కుడివైపునకు కదులుతుంది. మూతి బిగిస్తే ఆగిపోతుంది.


ఇలాగే ఇవ్వాల్సిన అవసరం లేదు. వీల్ చైర్ లో ఉండే వ్యక్తికి అనుకూలంగా ఈ సెట్టింగ్స్‌ మార్చుకోవచ్చు. రోగులకు ఈటెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కుర్రీ పేరు వీలి అని పెట్టారు. దీన్ని కేవలం 7 నిమిషాల్లో సెట్ చేసుకోవచ్చట. బావుంది కదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: