సమాచారం పంప‌డానికి  అయినా.. వీడియో కాల్స్.. వాయిస్ కాల్స్.. మెసేజెస్ ఇలా దేని కైనా  ప్రస్తుతం అందరు అత్యంతంగా ఉపయోగించే యాప్స్ అంటే  అది కేవలం వాట్సాపే అని చెప్పొచ్చు . అలాంటి వాట్సాప్ ఇక మనకు కనపడదు అంటే, నెటిజన్లు అందరు ఒక్కసారిగా షాక్ కి గురి అవుతున్నారు.


ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్,ఇక గూగుల్‌ ప్లేస్టోర్‌లో  మాయం.ఇక మీదట వాట్సాప్ కనిపించదు,డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం కూడా లేదు అని చెప్తున్నారు ఎమ్‌ఎస్‌పవర్‌ యూజర్‌ వెబ్‌సైట్‌. కానీ ఈ పరిస్థితి  కేవలం వాట్సాప్‌ను కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు తెలిపింది. ఈ సమస్యకు కారణం ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇప్పటికే వాట్సాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు అన్‌ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే, మై యాప్స్‌ సెక్షన్‌ ద్వారా తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారని ఆ వెబ్‌సైట్‌ తెలిపారు.


పాత యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారు కాబట్టి గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి పూర్తిగా మాయం కాలేదని అర్థమవుతోందని వివరించారు.అయితే గూగుల్‌ ప్లేస్టోర్‌లో  కూడా ‘వాట్సాప్ ఫర్‌ బిజినెస్‌’ యాప్‌ ఇప్పటికీ ఉండటం గుర్తించామని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఉదయం లేవగానే చాలామంది మొదట వాట్సాప్నే చూస్తారు. అలంటి వాట్సాప్ కి ఇప్పుడు ముప్పు వాటిల్లింది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూజర్లు. వాట్సాప్ మన జీవితంలో అంతలా ప్రాముఖ్యత సంపాదించుకుంది అంటే నిజమే అని చెప్పుకోవాలి.

గత కొన్నేళ్లలో వాట్సాప్ వినియోగదారులు చాలా విపరీతంగా పెరిగారు. ఎక్కడ చూసినా వాట్సాప్ కనిపిస్తుంది. అంతలా మనం దానికి అలవాటు పడిపోయాం. కానీ ప్రస్తుతం పాత యూజర్స్ కి ఎలాంటి నష్టం లేదని,ఇదివరకటి లానే ఉపయోగించ్చచు అని చెప్పుకొచ్చాయి ప్రముఖ వెబ్‌సైట్‌లు. కేవలం కొత్తగా ఇన్స్టాల్ చేసేవారికి ఈ సమస్య ఎదురవుతుంది అని పేర్కొంటున్నారు. తొందరలోనే దీనికి తగిన పరిష్కారం వస్తుంది అని కంగారు పడవద్దు అని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: