ఇండియ‌న్ టెలికం రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌తో దూసుకుపోతోన్న రిల‌య‌న్స్ జియో మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్‌తో వ‌చ్చేసింది. జియో రెండు రోజుల క్రిత‌మే తొలిసారిగా వాయిస్ కాల్స్‌కు చార్జీలు విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు జియో ఎంట్రీ ఇచ్చాక ఇప్ప‌టి వ‌ర‌కు ప్రీ కాల్స్ స‌దుపాయ‌మే కంటిన్యూ అవుతోంది.


ఇక తాజాగా ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయబోతున్నట్టు ప్రకటించ‌డంతో ఒక్క‌సారిగా యూజ‌ర్లు షాక్ అయ్యారు. అయితే ఇది ఇత‌ర నెట్‌వ‌ర్క్‌లు అని చెప్పినా జియో పెద్ద దెబ్బేసింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఈలోగానే జియో మ‌రో తీపి క‌బురు అందించింది. 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది.
 
తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు 30 నిమిషాల ఉచిత టాక్‌టైం ఇవ్వనున్నట్టు జియో పేర్కొంది. అయితే ఇక్క‌డే ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. రీచార్జ్ ప్లాన్లు ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ వన్-టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇంటర్‌కనెక్ట్ ఫీజును రద్దు చేసే వరకు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసే ఖాతాదారుల నుంచి నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని జియో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: