ఎన్ని కంపెనీలు.. ఎన్ని ఆఫర్లు ఇచ్చి.. ఎన్నో ఆప్షన్లు ఇచ్చి వచ్చిన సరే.. శాంసంగ్ ఫోన్ నుండి వచ్చే ఫోన్లకు ఎక్కువ గిరాకీ ఉంటది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ మొబైల్‌ తయారీ దారు శాంసంగ్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకురావాలని శాంసంగ్ సంస్ద ఆలోచిస్తుంది. 


అందరికి అందుబాటులో ఉండే ధరలో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించనుందని సమాచారం. గెలాక్సీ ఎస్ 10 లైట్ మొబైల్‌లో గెలాక్సీ ఎ 91 మాదిరిగానే 45వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌, ట్రిపుల్‌ రేర్ కెమెరాను అమర్చినట్టు తాజా సమాచారం. అయితే ఈ విషయాలను సంస్ద అధికారకంగా ప్రకటించలేదు. జీఎస్‌ఎం ఎరేనా రిపోర్టు ప్రకారం గెలాక్సీ ఎస్ 10 లైట్ ఫీచర్లు ఇలా ఉండనున్నాయి. మరి ఫీచర్లు ఎలా ఉంటాయో చుడండి.  


శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌ ఫీచర్లపై అంచనాలు


6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే


స్నాప్‌డ్రాగన్ 855


8 జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్


48 ఎంపి మెయిన్ కెమెరా + 12 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5 ఎంపీ డెప్త్ సెన్సార్


32 ఎంపీ సెల్ఫీ కెమెరా


4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


చూశారుగా.. ఫోన్ కొత్త కొత్త ఫీచర్లు. మరి ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: