హైదరాబాద్ ఐటీ హబ్ గా ఎప్పుడో నిరూపించుకుంది. ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అదే సమయంలో మరికొన్ని రంగాల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించాలని ప్రయత్నిస్తోంది. అందులో డిజైనింగ్ ఒకటి. అందుకే.. దేశం లోనే మొదటి నేషనల్ డిజైన్ సెంటర్‌ను హైదరాబాలో ఏర్పాటు చేసేందుకు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక విభాగం తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు తెలిపారు.


హైదరాబాదు అత్యుత్తమ అంతర్జాతీయ డిజైన్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ డిజైన్ వీక్ సమావేశానికి ముఖ్య అతిథిగాకేటీఆర్ హాజరయ్యారు. నగరంలో ఏర్పాటు కానున్న నేషనల్ డిజైన్ సెంటర్ ఇతర కంపెనీలకు డిజైన్ కల్టెన్సీ సేవలు అందించడంతో పాటు డిజైనింగ్ విద్యకు సంబంధించి శిక్షణ తరగతుల నిర్వహిస్తుంది.


నేషనల్ డిజైన్ సెంటర్ ఇతర కంపెనీ లకు డిజైన్ కల్టెన్సీ సేవలు అందించడంతో పాటు డిజైనింగ్ విద్యకు సంబంధించి శిక్షణ తరగతుల నిర్వహణ, భారతీయ డిజైన్లను ప్రపంచ స్థాయి మార్కెట్లోకి తీసుకెళ్లడం, డిజైన్ పరిశోధన వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. డిజైనింగ్ రంగంలో వస్తున్న ఆధునిక పరిజ్ఞానం , సవాళ్లు , సమస్యలపై చర్చించేందుకు ఈసమావేశం ఎంతో దోహదం చేస్తుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: