పండగ సీజన్లో ఏ వ్యాపారమైనా మూడు పువ్వులు ఆరుకాయలు అవ్వాల్సింది. మన పండగలకున్న పవర్ అలాంటిది. ఎందుకంటారా? ఇక ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్‌ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్‌సెట్‌తో విడుదలైన అధునాతన స్మార్ట్‌ఫోన్లు అంటే జనం ఊరుకుంటారా?  తాజాగా షావోమి మార్కెట్‌లోకి విడుదల చేసిన ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ స్మార్ట్‌ఫోన్లు 15 నిమిషాల్లోపే అమ్ముడైపోయాయి.

ఈ రోజు  మధ్యాహ్నం 12 గంటలకు  అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్‌ అయ్యాయి.ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు.. గూగుల్‌ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేసే ఈ ఫోన్లు ఎంఐ వెబ్‌సైట్‌లో నోస్టాక్‌ అని కనిపించగా, వెయిట్‌ లిస్ట్‌ ఫుల్‌ అని అమెజాన్‌ వెట్‌సైట్‌ చూపించిందంటే అర్ధం చేసుకోవచ్చు అమ్మకాలు ఏ రేంజ్ లో ఉన్నాయో. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్‌ ఇవే కావడంతో వీటిని కొనేందుకు వినియోగదారులు ఎగబడ్డారు.

అప్పుడే అయిపోయాయని బాధ పడకండి రేపు కూడా ఈ ఫోన్లు ఎంఐ, అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టనున్నట్టు షావోమి తెలిపింది.అంటే అక్టోబర్‌ 22 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయన్నమాట.ఇక స్మార్ట్‌ఫోన్లు ఫీచర్లు ఆ  సంస్థ ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ వివరించారు.  6.39 అంగుళాల డిస్‌ప్లే తో  1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 9 పై క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 665 సాక్‌ ఉన్న ఈ ఫోన్  4 జీబీ ర్యామ్‌ , 64 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంది. 48+ 8 + 2 +2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ 4జీబీ/64జీబీ ధర రూ.9,999 6జీబీ/128జీబీ ధర రూ.12999 కే రెడ్‌మి నోట్‌ 8 లభిస్తుంది.

ఇక మరొకటి 6.53 అంగుళాల డిస్‌ప్లేతో ... 1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, మీడియా టెక్‌ హీలియో ప్రాసెసర్‌ జీ90టీ ఆండ్రాయిడ్‌ 9 పై, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉంది. 4+8+2+2 ఎంపీ క్వాడ్‌ రియర్‌ కెమెరా మరియు  20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6జీబీ/64జీబీ ధర రూ.14999, 6జీబీ/128జీబీ ధర రూ.15,999, 8జీబీ/128జీబీ ధర రూ.17999 కే రెడ్‌మినో ట్ 8 ప్రో లభిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: