ప్ర‌స్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కం ఎక్కువ అయిపోయింది. ఇక స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రికి వాట్స‌ప్ త‌ప్ప‌నిస‌రిగా ఉండే ఉంటుంది. అదే విధంగా వాట్ప‌ప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పెడుతూ యూజ‌ర్ల‌ను ఆక‌ర్షిస్తోంది. అయితే చాలా మందికి వాట్ప‌ప్‌లో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అవి డిలీట్ చేయ‌డం ఇష్టం లేక‌.. బ్యాకప్‌ చేసుకోవడానికి అవకాశం లేక స‌త‌మ‌త‌మ‌వుతారు. అయితే అలాంటి వారు ఈ టిప్స్‌ను యూజ్ చేయ‌వ‌చ్చు.


వాట్స‌ప్‌లో ఉన్న మీ సీక్రెట్స్ ఈజీగా హైడ్ చేయ‌వ‌చ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో.. దీనికోసం ముందుగా ముందుగా మీ వాట్సప్‌ ఓపెన్‌ చేయండి. అందులో ఛాట్‌ స్క్రీన్‌ ఓపెన్‌ చేయండి. దాన్ని ట్యాప్‌ చేయండి. ట్యాప్‌ చేయగానే మీకు కుడి పక్కన ఆర్చివ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయండి. దాన్ని క్లిక్‌ చేస్తే మీ ఛాట్‌ ఆర్చివ్‌లోకి వెళ్లిపోతుంది. అయితే ఇది ఎక్కువ కాలం ఉండదు మీరు మీ మీ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొంత భాగంలో ఆర్చివ్‌ ఛాట్‌ని చూడవచ్చు.
 
అదే ఐఫోన్‌లో అయితే.. ముందుగా మీ వాట్సప్‌ ఓపెన్‌ చేయండి.  అందులో ఛాట్‌ స్క్రీన్‌ ఓపెన్‌ చేయండి. దాన్ని మీ వేళ్లతో స్లైడ్‌ చేస్తే రైట్‌ సైడ్‌ లోని లెఫ్ట్‌లో మీకు ఆర్చివ్‌ కనిపిస్తుంది.  దాన్ని ట్యాప్‌ చేస్తే సరిపోతుంది. మరి దీన్ని ఆన్‌ ఆర్చివ్‌ చేయాలంటే కింద కనిపించే ఛాట్‌ స్క్రీన్‌లో కెళ్లి దానిని అన్‌ ఆర్చివ్‌ చేస్తే సరిపోతుంది. ఐఫోన్‌లో కూడా అదే ప్రాసెస్‌లో చేయవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: