మెగా పవర్ స్టార్ రాం చరణ్, సూపర్ హిట్ డైరక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. కాంబినేషన్ పై  భారీ అంచనాలు ఉండటంతో సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయే సరికి ఆడియెన్స్ అప్సెట్ అయ్యారు. 


తనని కాపాడిన అన్నయ్యలకు రక్షకుడిగా ఉండే హీరో కథ వినయ విధేయ రామ. ఈ సినిమా రిలీజ్ టైంలో మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాతో పోల్చారు. చిరు కెరియర్ లో బ్లాక్ బస్టర్ బొమ్మ గ్యాంగ్ లీడర్. అలాంటి సినిమాతో పోలిక పెట్టేసరికి వి.వి.ఆర్ మీద మరింత అంచనాలు పెరిగాయి. 


92 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వినయ విధేయ రామ ఫుల్ రన్ లో 62 కోట్లు మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్ డీటైల్స్ చూస్తే..


నైజాం : 12.60 కోట్లు 
సీడెడ్ : 11.90 కోట్లు
ఉత్తరాంధ్ర : 8.50 కోట్లు
కృష్ణా : 3.70 కోట్లు
ఈస్ట్ : 5.40 కోట్లు
వెస్ట్ : 4.43 కోట్లు
గుంటూరు : 6.35 కోట్లు
నెల్లూరు : 2.88 కోట్లు
ఏపి/తెలంగాణ : 55.76 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 5.40 కోట్లు
ఓవర్సీస్ : 1.40 కోట్లు
వరల్డ్ వైడ్ : 62.61 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: