తెలుగు ఇండస్ట్రీలోకి అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. ‘అఖిల్’, ‘హలో’చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు.  అఖిల్ మూడవ చిత్రంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన 'మిస్టర్ మజ్ను' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు కావడం, టీజర్, ట్రైలర్స్ బావుండడంతో ఈసారి అఖిల్ హిట్ కొట్టడం పక్కా అని అంతా భావించారు. కానీ మిస్టర్ మజ్ను చిత్రానికి తొలి రోజు నుంచే డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది.  

లిమిటెడ్‌గానే ప్రీరిలీజ్ బిజినెస్

మిస్టర్ మజ్ను చిత్రానికి తొలి వీకెండ్ నిరాశా జనకంగా ముగిసింది. ఓపెనింగ్స్ కూడా అఖిల్ గత చిత్రాల స్థాయిలో నమోదు కాలేదు. తొలి వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం 9.6 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.  గత చిత్రాలకంటే ఓపెనింగ్స్ తక్కువగా వచ్చినప్పటికీ, ఆ తరువాత వసూళ్లు పుంజుకుంటాయని భావించారు. కానీ నాలుగు రోజుల్లో ఈ సినిమా 9.6 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది. సోమవారం నుంచి వసూళ్లు మరింత డ్రాప్ కావడంతో, ఫుల్ రన్ లో ఈ సినిమా 15 కోట్ల వరకూ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


మిస్టర్ మజ్ను చిత్రం ఫుల్ రన్ లో 15 కోట్ల వద్ద ఆగిపోనుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్ర బయ్యర్లంతా 30 శాతం వరకు నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యూఎస్ లో ఈ చిత్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది..అక్కడ 3 లక్షల డాలర్ల మార్క్ ని కూడా అందుకోలేదు.  ఎన్నో అంచనాలు పెట్టుకున్న అఖిల్ ఈసారి కూడా మిశ్రమ ఫలితం రావడంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పై తగు జాగ్రత్తలు తీసుకుంటా బాగుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: