టాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి.  కొంత కాలంగా వరుసగా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ మంచి విజయాలు అందుకుంటు న్నారు విక్టరీ వెంకటేష్.  సోలోగా ఆ మద్య గురు సినిమాలో నటించి హిట్ అందుకున్న ఆయన ఓ వైపు సోలో హీరోగా నటిస్తూనే మరోవైపు మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నాడు. 

Image result for ఎఫ్ 2 కలెక్షన్స్ ఫైనల్

ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘ఎఫ్ 2’సినిమాలో నటించారు. ఈ సినిమాకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు.  మరో ముఖ్యపాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు.  వెంకటేష్ – వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా , మెహ్రిన్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఆ సమయానికి కథనాయకుడు, వినయ విధేయ రామ, పేట సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఎలాంటి భారీ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఎఫ్2 మొదటి రోజే థియేటర్లలో హిట్ టాక్ సంపాదించింది. 

Image result for ఎఫ్ 2 కలెక్షన్స్ ఫైనల్

ఈ సినిమాలో ఫుల్ లెన్త్ కామెడీ ఉండటంతో తెలుగు రాష్ట్ర ప్రజలు బాగా ఆదరించారు.  విడుదల రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తూ వస్తున్న ఈ మూవీ 50 రోజుల వరకు వచ్చిన కానీ సందడి ఏమాత్రం తగ్గలేదు. ఈ మద్యే 50 రోజులు పూర్తి చేసుకొని టాప్ 10 సినిమా జాబితాలో టాప్ 8వ స్థానంలో నిలిచింది. ఇటీవలే 50 రోజుల వేడుక జరుపుకుంది. వరల్డ్ వైడ్ దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 81.05 కోట్ల షేర్ వసూలైంది. థియేట్రికల్ రైట్స్ రూ. 34.50 కోట్లకు అమ్ముడవ్వగా... అంతకు రెట్టింపు లాభం వసూలు చేసింది. దిల్ రాజు బేనర్లో అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రంగా నిలిచింది.


ఎఫ్ 2 మూవీ ఏరియా కలక్షన్స్:


నైజాం రూ. 22.8 కోట్లు
సీడెడ్ రూ. 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర రూ. 10.50 కోట్లు
తూర్పు గోదావరి రూ. 7 కోట్లు
పశ్చిమ గోదావరి రూ. 4.3 కోట్లు
కృష్ణ రూ. 5.2 కోట్లు
గుంటూరు రూ. 5.6 కోట్లు
నెల్లూరు రూ. 2.05 కోట్లు
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొత్తం షేర్ : రూ. 66.15 కోట్లు
ఇతర చోట్ల రూ. 5.60 కోట్లు
ఓవర్సీస్ రూ. 9.30 కోట్లు
మొత్తం షేర్ రూ. 81.05 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: