ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బీఐ స్పెషల్‌ ప్యాకేజీ అందిస్తోంది. మారిన కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని ప్ర‌భుత్వ శాఖ‌కు చెందిన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ ప్ర‌త్యేక ప్యాకేజ్ అందిస్తుంది. ఎస్‌బీఐ శాఖల ద్వారా జీతాలు తీసుకునే రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికి ఈ ప్యాకేజ్ ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్‌ ఖాతాలను స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీగా  మార్చుకుంటే ఎస్‌బీఐ నుంచి మిగిలిన‌ ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన రాయితీలు  మ‌రియు సేవలు వంటి అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.


అయితే సుమారు 42 వేల మంది ప్రభుత్వోద్యోగులకు ఎస్‌బీఐ ప్యాకేజ్‌లు వ‌ర్తిస్తున్నాయి. మ‌రియు ఉద్యోగుల్లో దీనిపై ఆవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎస్‌బీఐ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. స‌హ‌జంగా సేవింగ్స్ ఖాతాలో రూ. 500 వ‌ర‌కు మినిమ‌మ్ బ్యాలెన్స్ ఉండాల‌న్న నిబంధ‌న ఉండేది. అయితే ప్ర‌స్తుతం ఎస్‌జీఎస్‌పీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా స‌రే ఎలాంటి చార్జీలు ఉండ‌వు. 


వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20 లక్షల వరకు బీమా ఉంటుంది. ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ఖాతాదారే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.30 లక్షల బీమా వర్తిస్తుంది. వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకున్న వారికి రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్‌ ఫీజులో 50శాతం రాయితీ లభిస్తుంది. 


ఏటీఎంల‌ నుంచి నగదు డ్రా చేసుకునే వారికి పరిమితులు కూడా ఉండవు. మ‌రియు లాకర్‌ చార్జీల్లో 25శాతం రాయితీ పొందవచ్చు. డీడీలకు సంబంధించి ఎటువంటి చార్జీలు వసూలు చేయరు.  ముఖ్యంగా వీరి ఖాతాలో నగదు లేకపోయినా వీరికి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఉంటుంది.  కానీ ఇచ్చిన గ‌డువులోపు చ‌ల్లించాల్సి ఉంటుంది. ఎస్జీఎస్పీలోకి మార్చుకోవడానికి ఉద్యోగి ఐడీ కార్డు, పాన్‌కార్డు, తాజా శాలరీ స్లిప్పు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలపై సంతకం చేసి బ్యాంకులో అంద‌చేయాలి. 


ఇక జీతాల ఆధారంగా ఖాతాలు ఈ విధంగా ఉంటాయి. రూ.5 - 20 వేలు ఉంటే గ‌నుక అది సిల్వర్‌ ఖాతా, రూ.20 - 50 వేలు ఉంటే గ‌నుక గోల్డ్‌ ఖాతా, రూ.50 వేలు - లక్షవ‌ర‌కు ఉంటే డైమండ్‌ ఖాతా, రూ.లక్ష పైబడి ఏంటూ అది ప్లాటినం ఖాతా అని అంటారు. ఎస్‌జీఎస్‌పీ ప్యాకేజీ వ‌ల్ల  ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: