ఎన్టీఆర్ బయోపిక్ తెలుగు వెండితెరకు సంక్రాంతి కళ తీసుకొచ్చింది. విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్‌ తో నడుస్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో పాత రికార్డులు బద్దలు కొడుతోంది. సాధారణంగా ఓవర్సీస్‌లో అంతగా మార్కెట్‌ లేని బాలయ్య.. ఎన్టీఆర్ కథానాయకుడితో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు.

Related image


అమెరికాలో మొత్తం 600కు పైగా స్క్రీన్లపై విడుదలైన బాలయ్య ఎన్టీఆర్ కథానాయకుడు.. ఫస్డ్ డే మూడున్నర కోట్ల రూపాయల వరకూ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో గీతగోవిందం సినిమా ఓవర్సీస్‌లో ఫస్ట్ డే 4,04,000 డాలర్లు వసూలుచేసి రికార్డు నెలకొల్పింది.

Related image


ఇప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది.  కథానాయకుడు 5,19,000 డాలర్ల వసూలు చేసి కొత్త చరిత్ర సృష్టించింది. సాధారణంగా బాలయ్య సినిమాలకు ఓవర్సీస్‌లో అంత డిమాండ్ ఉండదు. కానీ బాలయ్య గత చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణితో సీన్ మారింది. ఈ సినిమాతో బాలయ్య ఫస్ట్ టైమ్ ఫస్ట్ డే మిలియన్ డాలర్ల కలెక్షన్ సాధించాడు. మళ్లీ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలోనే కొత్త రికార్డు సృష్టించడం విశేషం.

Image result for ntr biopic collections


ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ కథానాయకుడు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ డే 30 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసినట్టు అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటివరకూ విడుదలైన బాలయ్య సినిమాలన్నింటిలోనూ ఇదే హైయ్యస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ అన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: