ఎన్నో అంచనాల నడుమున విదులైన మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పుడు రెండో పార్ట్ విడుదల అయినా రిజల్ట్ మాత్రం మారలేదు. మరీ ఘోరంగా కలెక్షన్స్ రావటం గమన్హారం. రెండోరోజు మహానాయకుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 40 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. వీటిలో 18 లక్షలు నైజాం నుంచి రాగా.. మిగతా మొత్తం ఏపీ నుంచి వచ్చింది.


ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా

ఈ సినిమా పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే.. ఆంధ్రా, సీడెడ్ లోని చాలా ప్రాంతాల్లో థియేటర్ అద్దెలకు సరిపడా వసూళ్లు కూడా రాలేదు మహానాయకుడు సినిమాకి. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే.. బాలయ్య వీరాభిమానులు, తెలుగు తమ్ముళ్లు సైతం ఈ సినిమాను లైట్ తీసుకోవడం విశేషం. ఓవైపు సినిమా ఇంత ఘోరంగా వసూళ్లు సాధిస్తుంటే, మరోవైపు ఓ సెక్షన్ నందమూరి అభిమాన వర్గం మాత్రం సిగ్గుమాలిన ట్రెండింగ్ ఒకటి మొదలుపెట్టింది.


ఎన్టీఆర్ కోసం తీశారా .. చంద్ర బాబు కోసం తీశారా

కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిన సందర్భంగా.. బాలయ్య రాక్స్ అంటూ ఈ ట్రెండింగ్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ ట్రెండింగ్ చూసి నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి. మొదటిభాగం దెబ్బతో కుదేలైన డిస్ట్రిబ్యూటర్లు, రెండోభాగంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వీళ్లను అస్సలు కోలుకోనివ్వలేదు మహానాయకుడు. దెబ్బమీద దెబ్బ పడడంతో పంపిణీదారులంతా ఇప్పుడు ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు, రేపోమాపో బాలయ్య ఇంటి ముందు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ ను దేవుడిగా చూపించాలని రెండు భాగాలుగా బాలయ్య చేసిన ప్రయత్నం, చివరికి అతడి పరువుకే భంగం వాటిల్లేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: