టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కానుకగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’రిలీజ్ అయ్యింది.  రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయ్యిందనే టాక్ వచ్చింది.  ఆ ప్రభావం కలెక్షన్ల పై కూడా బాగానే పడింది.  ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 22 న విడుదలయింది. 
Image result for ntr mahanayakudu
బాలయ్య కెరీర్లోనే అత్యంత తక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ తో అందరికీ షాక్ కి గురించి చేసింది.  వాస్తవానికి ఈ సినిమా సెంటిమెంట్ పరంగా బాగా ఆకట్టుకుంటుందని..సినిమాకి ముందు ప్రమోషన్ కూడా బాగానే చేశారు.  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా శని, ఆది వారాల్లో సైతం కలెక్షన్లు  ఆశాజనకంగా లేకుండా పోయాయి.  మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 3.40 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
Image result for ntr mahanayakudu
సోమవారం కూడా కలెక్షన్లు ఆశాజనకంగా లేవని మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' డిజాస్టర్ అయినప్పటికీ కనీసం రూ. 20 కోట్లు కలెక్ట్ చేసింది.  కానీ మహానాయకుడు మాత్రం రూ. 5 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందా అనేది సందేహమే.  ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా లయ్య కెరీర్లో ఇది మరో దారుణమైన డిజాస్టర్ గా నిలిచేలా ఉంది. 


మహానాయకుడు కలెక్షన్లు :
నైజామ్: 0.63 కోట్లు
సీడెడ్: 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.27 కోట్లు
కృష్ణ: 0.30 కోట్లు
గుంటూరు: 0.61 కోట్లు
ఈస్ట్ : 0.18 కోట్లు
వెస్ట్: 0.16 కోట్లు
నెల్లూరు: 0.11 కోట్లు
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 2.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.24 కోట్లు
ఓవర్సీస్: 0.61 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 3.40 కోట్లు



మరింత సమాచారం తెలుసుకోండి: