టాలీవుడ్ లో పటాస్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు నందమూరి హీరో కళ్యాన్ రామ్.  హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఆ మద్య బాబీ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘జై లవకుశ’సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  అంతకు ముందు రవితేజతో చేసి కిక్ 2 తో దారుణమైన నష్టాన్ని చవిచూశాడు.  కానీ, కళ్యాన్ రామ్ మాత్రం నటుడిగా, నిర్మాతగా రెండు రంగాల్లో తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు.  ఈ శుక్రవారం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన '118' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
రూ. 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్
మార్చి 1న విడుదలైన ఈ చిత్రం డిసెంట్ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో రెండో రోజైన శనివారం కూడా వసూళ్లు స్ట్రాంగ్‌గా ఉన్నాయి.  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమా కథ, స్క్రీన్ ప్లేతో పాటు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో మంచి టాక్ వచ్చింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  బయ్యర్ల పెట్టుబడిలో 40 శాతం రాబట్టినట్టు చెబుతున్నారు. తొలివారంలోనే ఈ సినిమా లాభాల బాట పట్టడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాతో కల్యాణ్ రామ్ కి హిట్ పడిపోయిందనే అంటున్నారు.  ట్రైలర్, టీజర్ రిలీజ్ చేస్తూ కొన్ని రోజుల ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు. వాటికి మంచి రెస్పాన్స్ రావడం... అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా డీసెంటుగా ఉండటంతో తొలి రోజు వరల్డ్ వైడ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఏపీ, తెలంగాణ కలిపి ఆయన ఈ చిత్రాన్ని రూ. 6కోట్లకు కొన్నట్లు సమాచారం. ఈ సినిమా తరువాత ఆయన దర్శకుడు శ్రీవాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: