బంగారం జీవిత చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కనీవిని ఎరగని రీతిలో బంగారం ధర పది గ్రాములకు నలభై వేల రూపాయలకు రీచ్ అయ్యింది. బంగారం రేటు కొద్ది రోజులుగా రికార్డుల మీద రికార్డులు క్రాస్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు 10 గ్రాముల బంగారం 40 వేల‌కు క్రాస్ అయ్యింది. కాసు అంటే 8 గ్రాముల బంగారం 32 వేల పైమాటే. కొన్ని సంవత్సరాల కిందటే బంగారం పది గ్రాముల ధర ముప్పై వేల రూపాయలను దాటింది. 


అక్క‌డితోనే అది ఆగింది. ఇక కొన్ని సంవ‌త్స‌రాలుగా రూ.25-35 వేల‌కు కాస్త అటూ ఇటూగానే న‌డుస్తూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు రికార్డు స్థాయిలో 40 వేలు ట‌చ్ అయ్యింది. సోమవారం మార్కెట్లో పసిడి రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. పదిగ్రాముల పసిడి ధర ఇప్పటి వరకూ చరిత్రలో ఎన్నడూ నలభై వేల రూపాయలకు రీచ్ కాలేదు. తొలిసారి అది జరిగింది. 


గ‌త వారం రోజులుగా బంగారం ధ‌ర పెరుగుతూనే వ‌స్తోంది. అస్స‌లు బ్రేక్ లేకుండా రేట్లు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగ‌డం లేదు. డిమాండ్ ఎక్కువుగా ఉండ‌డంతో పాటు, ఆర్డ‌ర్లు కూడా అలాగే ఉండ‌డంతో బంగారం రేటుకు బ్రేకుల్లేవు. ఇక వెండి కూడా చుక్క‌ల్లోనే ఉంది. వెండి ధర కేజీ నలభై ఆరు వేల రూపాయలకు రీచ్ అయ్యింది. 


డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతూ ఉండటం - ఆర్థిక  మాంద్యం ఆందోళనల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు భారీగా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే బంగారం రేటు రోజు రోజుకు పెరిగిపోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: