కొద్ది రోజులుగా బంగారం రేటు ఉరుకులు ప‌రుగులు పెడుతోంది. బంగారం రేటు జోరుకు బ్రేకుల్లేవు. ఎట్ట‌కేల‌కు బంగారం రేటుకు బ్రేకులు ప‌డ్డాయి. శుక్ర‌వారం నాటి బులియ‌న్ ట్రేడింగ్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 372 త‌గ్గింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.39,278కు చేరుకుంది. ఆభ‌ర‌ణాల త‌యారీదారుల నుంచి వ‌చ్చే ఆర్డ‌ర్లు త‌గ్గ‌డంతో పాటు అంత‌ర్జాతీయ మార్కెట్లో రూపాయి బ‌ల‌ప‌డ‌డంతో బంగారం రేటు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.


ఇదే క్ర‌మంలో కొద్ది రోజులుగా వెండి ధ‌ర కూడా పెరుగుతూ వ‌స్తోంది. శుక్ర‌వారం రేటు బ‌ట్టి చూస్తే వెండి రేటు కూడా బాగా త‌గ్గింది. కేజీ వెండి రూ.1273 త‌గ్గి రూ. 49,187కు చేరుకుంది. బంగారంపై పెట్టుబ‌డులు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని... దీనికి తోడు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి విలువ బ‌లంగా ఉండ‌డంతో రూపాయి రేటు 21 పైస‌లు పుంజుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి.


ఇక అంత‌ర్జాతీయంగా చూస్తే ఔన్స్ బంగారం రేటు 1510 డాల‌ర్లుగా ఉంది. వెండి కూడా ధ‌ర త‌గ్గి ఔన్సు 18.30 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఏదేమైనా కొద్ది రోజులుగా దూకుడుగా ముందుకు వెళ్లిన బంగారం రేట్లు వెన‌క్కు వ‌స్తుండ‌డం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: