అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి రోజురోజుకు బలపడుతోంది. ఈ క్రమంలోనే భారత మార్కెట్లో బంగారం ధర రోజు రోజుకు తగ్గుముఖం పడుతోంది. 15 రోజుల క్రితం వరకు 10 గ్రాముల బంగారం ఏకంగా 40 వేల మార్క్‌ క్రాస్ చేసి బంగారం జీవిత చరిత్రలోనే అత్యధిక రేటు ట‌చ్ చేసి రికార్డులకెక్కింది. తాజాగా డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి రోజు రోజుకు బ‌ల‌పడుతుండడంతో బంగారం, వెండి ధరలు గత పది రోజులతో పోల్చుకుంటే తగ్గుముఖం పడుతున్నాయి.


క్రితం వారంతో పోలిస్తే బంగారం రేటు రూ. 2200 తగ్గింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు... రూపాయి బలపడుతూ వస్తుండడంతో బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారం ధర గత వారపు 39,885 రూపాయల ధరతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రూ  2,200 తగ్గింది. వెండి ధర కూడా తగ్గుతూనే వస్తోంది. గత వారపు 51,489 రూపాయల ధరతో పోలిస్తే వెండి ధర దాదాపు 8 శాతం పతనమైంది.


ప్ర‌పంచ‌ మార్కెట్‌లో బంగారం ధర స్తబ్దుగానే కొనసాగుతోంది. ఔన్స్‌కు 1,499 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 1,550 డాలర్ల స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు హ‌య్య‌స్ట్ రేటుతో పోలిస్తే 4 శాతం ప‌డిపోయింది. వెండి ధర ఔన్స్‌‌కు 18 డాలర్ల వద్ద కదలాడుతోంది.
ఇప్పుడెలా ఉన్నా ఫ్యూచ‌ర్‌లో బంగారం రేటు పెర‌గ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. దేశీ మార్కెట్ విషయానికి వస్తే.. బంగారం ధరల తగ్గుదల కలిసొచ్చే అంశామని జువెలరీ డిమాండ్ పెరుగుతుందని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: