టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ ఉన్నప్పటికీ... అతను మాత్రం ఎప్పుడు అత్యంత సాధారణం గానే ఉంటాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అత్యద్భుతమైన గుణం మహేష్ బాబు కి ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. తన సినిమాల చిత్రీకరణ సమయంలో కూడా డైరెక్టర్లు చెప్పినట్టు వింటూ... రెండు మూడు సార్లు రీటేక్ లు తీసుకొని మరీ అద్భుతమైన నటనని తన అభిమానులకు చూపించేందుకు ఎప్పుడూ తీవ్రంగా కష్టపడుతుంటాడు మహేష్ బాబు.
అతను సంపాదించిన డబ్బులో 30శాతం దానధర్మాలు చేస్తుంటాడు. తన కుమారుడు గౌతమ్ పుట్టిన సంవత్సరం నుండి రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ తో భాగస్వామి అయ్యాడు. అలాగే 2 గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా తీసి ధనికులు పేదలకు సహాయం చేయాలని మహేష్ బాబు ఒక మంచి ఆలోచనని ప్రజల్లోకి తీసుకు వెళ్ళాడు. అతను ఎంత సహాయం చేసినా పబ్లిసిటీకి మాత్రం చాలా దూరంగా ఉంటాడు.
ఇప్పటివరకు అతను ఎటువంటి వివాదాల్లో చిక్కుకోకుండా, ఏ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ ఖాళీ సమయంలో కుటుంబంతో ఎంతో హాయిగా గడుపుతుంటాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన పిల్లలతో గడిపేందుకు ప్రతి రోజూ ఎంతో కొంత సమయం కేటాయిస్తాడు. ఒక సినిమా పూర్తవగానే వెంటనే విరామం తీసుకొని తన కుటుంబం తో ఫారిన్ ట్రిప్ కి వెళ్తుంటాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. చాలా నెమ్మదస్తుడిగా నడుచుకునే మహేష్ బాబుకి విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో అతని ఇంటర్వ్యూని చూస్తే ఎవరైనా పడి పడి నవ్వాల్సిందే.

44 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ కుర్రాడిలా ఉన్న మహేష్ బాబు ఫిట్నెస్ కి సీక్రెట్ వేగంగా పరిగెత్తడమేనట. థ్రెడ్ మిల్ పై ఆగకుండా గంట సేపు పరిగెత్త గల ఏకైక సీనియర్ హీరో మహేష్ బాబు... తనలాగే అందరూ ఫిట్ గా ఉండాలని కోరుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్యుల సహాయంతో 1000 మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు. ఇప్పటికీ చాలా మంది పిల్లల ప్రాణాలను కాపాడాడు. 2 వారాల క్రితం ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సర్జరీ చేయించి తన ప్రాణాలను కాపాడి నిజమైన హీరో అయ్యాడు. ఏదేమైనా అందమే కాదు మంచి మనసు కూడా ఉన్న పరోపకారి మహేష్ బాబు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: