యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అందరు వైఎస్సార్ అని పిలిచే జననేత ఆయన. డాక్టర్ చదువు చదివి రాజకీయాల మీద ఆసక్తితో విద్యార్ధి దశ నుండే కళాశాలలో హౌజ్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓ పక్క వైద్య అధికారిగా పనిచేస్తూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కుల మత రాజకీయాలను వ్యతిరేకంగా వైఎస్సార్ పరిపాలన ఉండేది. కడప నుండి 4 సార్లు లోక్ సభకు ఎన్నికైన వైఎస్సార్. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 సార్లు విజయం సాధించాడు. 

 

పాదయాత్రతో గడప గడపకు తిరిగి ప్రజల కష్టాన్ని తెలుసుకున్న వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రవేశ పెట్టి పేదల మనసులో చిరస్థాయిగా నిలిచారు వైఎస్సార్. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వ పధకాలు ప్రవేశ పెట్టడంలో వైఎస్సార్ ముందుండేవాడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కష్టాలను తీర్చేలా పరిపాలన ఉంటుంది. అందుకే ఆయన ప్రజల మనసులు గెలిచిన జననేత అని పిలుస్తారు. ప్రజలకు మేలు చేసే పధకాలు, విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ లాంటి ఎన్నో పథకాలను ప్రజలకు అందించారు వైఎస్సార్.    

 

తన దగ్గరకు సమస్యతో వచ్చిన వారిని సమస్య సాల్వ్ చేసి పంపించే గొప్ప మనసు ఆయనకు ఉంది. ప్రజల నేతగా.. ప్రజా నాయకుడిగా వైఎస్సార్ ఆంద్ర రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రక్షాళణ చేశారు. అనుకున్నది సాధించేంత వరకు ఆయనే ఓ సైనికుడిగా పోరాడే వారు. మహానేత ఈరోజు జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలతో ఆయనకు నివాళి అర్పిస్తుంది ఏపిహెరాల్డ్.కామ్. వైఎస్ చూపించిన బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసిపితో 2019 జరిగిన ఏపి ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్నారు.              

మరింత సమాచారం తెలుసుకోండి: