తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది నట వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ మంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోలుగా రాణించారు. అలాంటి వారిలో శ్రీకాంత్, రవితేజ, నాని లాంటి వారు స్టార్ హోదా దక్కించుకున్నారు.  నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా  పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా పనిచేసాడు.  డైరెక్టర్ గా ఎదిగి మంచి చిత్రాలు తీయాలనే ఆశతో ఉన్న నానికి అనుకోకుండా ‘అష్టా చమ్మా’ చిత్రంలో హీరోగా నటించే అవకాశం వచ్చింది.

IHG'Clap Assistant' | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించిన అష్టా చమ్మా చింత్రలో నాని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వరుసగా హీరోగా ఛాన్సులు వచ్చాయి. నాని నటించిన ఈగ కూడా ప్రేక్షకులనుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. తన నేచురల్ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు నాని.. అందుకే నేచురల్ స్టార్ గా ఎదిగాడు.  మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంత తర్వాత నాని జాతకం పూర్తిగా మారిపోయింది.  వరుసగా  ఎనిమిది విజయాలను అందుకున్నాడు.

IHG

2014 లో నాని నిర్మాతగా డీ ఫర్ దోపిడీ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ! అనే చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా కూడా విజయాన్ని అందుకున్నాడు. 2018 ఏప్రిల్ లో వచ్చిన కృష్ణార్జున యుద్ధంలో నటించాడు.  కాకపోతే ఈ మూవీ ఆశించినంతగా విజయం అందుకోలేదు. ఆ తర్వాత మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ 2 కి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు నాని.2018 లో కింగ్ నాగార్జున అక్కినేని గారితో దేవదాస్ సినిమాలో కలిసి నటించారు.

IHG

2019లో జెర్సీ సినిమాతో మన ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.  ప్రస్తుతం నాని ‘వి’ చిత్రంలో నటిస్తున్నాడు.. కరోనా వైరస్ కారణంగా షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకుల మనసు దోచి.. రేడియో జాకీ నుండి.. నేచురల్ స్టార్ గా ఎదిగిన నాని మరిన్ని విజయాలు అందుకోవాలని ఇండియాహెరాల్డ్.కామ్ కోరుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: