భారత క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన సారధి అతడు... భారత క్రికెట్లో ఆశా కిరణం... ఉవ్వెత్తున ఎగసి పడే కెరటం ఆ ఆటగాడు... ఓ వైపు తన బౌలింగ్ బ్యాట్స్మెన్ లకు వెన్నులో వణుకు పుట్టిస్తూనే.. తన బ్యాట్ తో  ఎన్నో మెరుపులు మెరిపించిన ప్రపంచ అత్యున్నత ఆల్రౌండర్ ఆ ఆటగాడు. ఆ గొప్ప దిగ్గజ ఆటగాడు ఎవరో  కాదు కపిల్ దేవ్. క్రికెట్ ప్రేక్షకులందరిలో కొత్త ఆశలు చిగురించేలా చేసి... భారత క్రికెట్ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా పాకేలా చేసిన గొప్ప సారధి. ప్రపంచంలోనే దిగ్గజ ఆటగాడి గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గొప్ప ఆటగాడు. భారత్ చిరకాల స్వప్నం అయిన వరల్డ్ కప్ ని సాధించి భారత జట్టుని  విశ్వవిజేతగా నిలిపి... ఎవరూ సాధించని సరికొత్త రికార్డును సాధించారు.




 1978 అక్టోబర్ 16 వ తేదీన కపిల్ దేవ్ పాకిస్తాన్ తో మొదటి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ కపిల్ దేవ్ కు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు, కానీ మూడో టెస్ట్ మ్యాచ్ను మాత్రం 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి అతి వేగంగా అర్థ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు కపిల్ దేవ్. ఇక కపిల్ దేవ్ తన క్రీడా జీవితంలో ఎన్నో రికార్డును సాధించారు అని ప్పాలి . టెస్ట్ క్రికెట్ లో నాలుగు వేల పరుగులు,  400 వికెట్లు సాధించిన తొలి ఆటగాడిగా  ప్రపంచ రికార్డును సృష్టించారు. అంతే కాకుండా అతి పెద్దదైన లార్డ్స్ మైదానంలో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన తొలి  ఆటగాడిగా  కూడా అవతరించాడు.



భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచకప్ను సాధించి అందరి లో సరికొత్త ఊపిరి నింపాడు. ప్రపంచ జట్లకు భారత జట్టు ఎక్కడ తక్కువ కాదు అని నిరూపించాడు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ కపిల్దేవ్ రికార్డులతో చరిత్ర సృష్టించారు అనే చెప్పాలి. 1983 లో ప్రారంభమైన ప్రపంచ కప్ లో అతి చిన్న జట్టుగా అడుగుపెట్టిన భారత్ వరుస విజయాలను అందుకుంటూ ఫైనల్ పోరు వరకు దూసుకెళ్లింది. భారత జట్టు ఫైనల్ వరకు వెళ్లినందుకే భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆనంద పడిపోయారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో భారత జట్టుకు విజయం వరించేలా చేసి... భారత క్రికెట్ ప్రేక్షకులందరికి మనసుల్లో మాటల్లో  చెప్పలేనంత ఆనందం నింపారు సారధి కపిల్ దేవ్.


 కపిల్ దేవ్ క్రికెట్ లో అందించిన సేవలకు గాను అర్జున అవార్డు పద్మశ్రీ అవార్డు, పద్మ విభూషణ్ లాంటి ఎన్నో అవార్డులను కూడా ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇలా భారత క్రికెట్ జట్టు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చి.. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన గొప్ప సారథి కపిల్ దేవ్ ఈరోజు హెరాల్డ్ విజేతగా నిలిచారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: