క్రికెట్ ఉన్నంత వరకు రాహుల్ ద్రావిడ్, కపిల్ దేవ్ సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోని వంటి గొప్ప క్రికెటర్లను మన భారతీయులు ఎప్పటికీ మర్చిపోరు, మరచిపోలేరు కూడా. దానికి కారణం వాళ్లు ఇండియన్ క్రికెట్ టీమ్ ని గెలిపించడానికి నిస్వార్ధంగా కష్టపడటమే. రాహుల్ ద్రావిడ్ ఎన్నో సందర్భాలలో నిస్వార్ధంగా ఇండియన్ క్రికెట్ టీం గెలవడం కోసం చమటోర్చాడు. బ్యాట్ మెన్ గా, బౌలర్ గా, వికెట్ కీపర్ గా, అద్భుతమైన ఫీల్డర్ గా, కెప్టెన్ గా, కోచ్ గా రాహుల్ ద్రావిడ్ తన జీవితం లో క్రికెట్ లోని అన్ని పొజిషన్స్ లలో సాటిలేని ఆటగాడిగా కొనసాగాడు. ఓడిపోయే మ్యాచ్లను కూడా ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 

 


ఎంతో ప్రతిభ కలిగిన స్పిన్, ఫాస్ట్ బౌలర్స్ లను కూడా అలవోకగా ఎదుర్కొన్న ఏకైక బ్యాట్ మ్యాన్ గా రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో అరుదైన సంచలనాలను సృష్టించాడు. గొప్ప గొప్ప క్రికెటర్లు సైతం రాహుల్ ద్రావిడ్ నుండి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టు తమ ఆటోబయోగ్రఫీ లలో పేర్కొన్నారు అంటే అతిశయోక్తి కాదు. టెస్ట్ క్రికెట్లో అతను నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారన్నది అక్షర సత్యం.

 

 

దీన్ని బట్టి క్రికెట్ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అతనికి ఎంత ఓపిక ఉండేదని అర్థం చేసుకోవచ్చు. అందుకే అతడిని మిస్టర్ డిపెండబుల్ అని అంటారు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లలో అతను 210 క్యాచ్ లు పట్టుకొని రికార్డు సృష్టించాడు. ఏదైనా మ్యాచ్ ఓడిపోతుంది అంటే టీం మొత్తానికి ఒక పిల్లర్ లాగా నిలిచి... క్రీజ్లో గంటపాటు ఒక్క వికెట్ కూడా కోల్పోనివ్వకుండా ఒక గోడలాగా నిలబడి... అందర్నీ సంరక్షించి విజయ తీరాల వైపు రాహుల్ ద్రావిడ్ ఎన్నోసార్లు తీసుకెళ్ళిన సందర్భాలున్నాయి. అందుకే అతడిని 'ది వాల్' అని అంటారు

 

 

రాహుల్ ద్రావిడ్ సేవలు కేవలం క్రికెట్ కు మాత్రమే పరిమితం అవ్వలేదు. క్యాన్సర్ బాధితులకు, అనారోగ్యం తో బాధపడుతున్న చిన్న పిల్లలకు తన వంతు ఆర్థిక సాయం చేసి గొప్ప మనసు చాటుకున్నాడు. అతడు రక్త దానం కూడా చేసిన సందర్భాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: