సినిమా షూటింగ్ అంటే చూసేవారికి వినోదంగానే అనిపిస్తుంది కానీ ఆ పాత్రలో నటించే వారి కష్టం మామూలుగా ఉండదు. ఒక్కోసారి షూటింగ్ ఉందంటే కొండలు కోనలు దాటాలి. గడ్దకట్టే చలిలో హీరో మాత్రం సూటుబూటు వేసుకుని వెచ్చగా రోమాన్స్ చేస్తుంటే హీరోయిన్ మాత్రం బట్టలే కరువైనట్లుగా ఆ చలిలో కూడా తన అందాలతో అటు హీరోను, ఇటు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయాలి. ఇకపోతే షూటింగ్ జరిగే సమయాల్లో జరిగే సంఘటనలు కొన్ని కొన్ని చూస్తే భలే ఫన్నీగా అనిపిస్తాయి. అంతే కాకుండా కధకు అనుగుణంగా వచ్చే సన్నివేశాలను రక్తికట్టించడానికి నటీనటులు పడే శ్రమను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.

 

 

ఇక ఇప్పుడు ఈ చైనా సినిమా షూటింగ్ చూస్తే మీకు అదే అనిపిస్తుంది. కానీ, అది చూస్తున్నంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారు... ఆ సినిమా పేరు "డ్రీమింగ్ బ్యాక్ టూ ది కింగ్ డెనస్టీ"  ఈ చిత్రంలో చైనా నటినటుడు లి ల్యాండీ, జిన్ యున్లాయ్ నటించిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో హీరో లి.. హీరోయిన్ జిన్‌ను మోసుకుంటూ నడవాలి. అయితే, అతడు ఆమెను ఎత్తుకోడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. అందుకు కారణం ఆ హీరోకంటే ఆమె లావుగా, బరువు ఎక్కువగా ఉండటం వల్ల అతడు చాలా కష్టంగా మోశాడు. దీంతో షూటింగ్ స్పాట్‌లో నవ్వులు విరిశాయి.

 

 

ఇక ఇలాగైతే షూటింగ్ సాగదు అని అనుకున్న ఆ చిత్ర యూనిట్ ఆమెను నిచ్చెనపై కుర్చోబెట్టి, హీరో మోసుకుంటూ వెళ్తున్నట్లుగా క్లోజప్‌ షాట్లు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోను కొందరు చైనా సోషల్ మీడియా సైటు ‘విబో’లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

 

 

అయితే, ఈ వీడియోను ‘సరదా’గా చూడాల్సిన జనం.. హీరోయిన్‌పై బాడీ షేమింగ్‌కు పాల్పడటం విచారకరం. లావుగా ఉన్నావంటూ ఆమెను హేళన చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఆమె 50 కిలోలు మించి బరువు ఉండకపోవచ్చని, హీరో మరీ బలహీనంగా ఉండి ఉంటాడని వెక్కిరిస్తున్నారు. ఇకపోతే మన హీరోలైతే గాల్లో రైళ్లను కూడా లేపుతారు ఇక హీరోయిన్లు ఒక లెక్కా అని ఈ సీన్ చూసిన తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారట..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: