కోడి గుడ్దు అంటే మంచి పోషకాలున్న ఆహారం అని అందరికి తెలిసిందే. కానీ ఈ గుడ్దు విషయంలో చాలా మందికి ఒక అనుమానం ఉంది. అదేమంటే ఇది నాన్ వెజ్, లేక వెజ్ అని. పోషకాహర నిపుణులు దీన్ని వెజ్ అంటున్నారు. కానీ పెద్దలు మాత్రం ఇది నాన్ వెజ్ అంటారు. అది సరే వారి గోల వదిలేస్తే, ఈ గుడ్దు ప్రపంచంలో కోటాను కోట్ల మందికి నేడు ఇష్టమైన ఆహారం. మనిషికి అవసరమైన ప్రొటీన్స్ ఇందులో లభిస్తాయి. అందుకే దీన్ని వైట్‌ మీట్‌ అంటారు.

 

 

ఇకపోతే బ్యాచిలర్స్‌కు అయితే ఈ గుడ్దు లేనిదే పొద్దు గడవదు. ఇకపోతే వంటింట్లో కోడిగుడ్లు ఉడకపెట్టినాక వాటి పొట్టు తీయడానికి చాలా మంది కుస్తీలు పడుతుంటారు. అంతే కాకుండా అర్జెంట్ అయితే వేడి వేడి గుడ్డుని తీయడానికి కాస్త ఇబ్బంది పడతారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ జోష్ ఇస్తుంది. ఈ వీడియో చూశాక కోడి గుడ్డు తొక్కను తీయడం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియోలో కేవలం పది సెకన్ల లోపే తొక్కను వలిచేసి చూసిన వారిని ఆశ్చర్యపరిచారు.

 

 

అదెలాగంటే మీరు చూస్తున్న వీడియోలో ఒక వ్యక్తి ఒక గ్లాసు తీసుకుని అందులో ఉడికించిన గుడ్డు పెట్టి అతను గాజు గ్లాసుని నీటితో నింపి, ఆపై వేగ౦గా షేక్ చేస్తాడు. తర్వాత ఆ గుడ్డును బయటకు తీశాక, ఆ గుడ్దు పెంకును ప్రెస్ చేయగానే ఈజీగా బయటకు వస్తుంది.

 

 

ఇకపోతే వీడియోలో కనిపించే నీటి వృధాపై కొంతమంది తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారట. ఎందుకంటే కోడి గుడ్డును గ్లాస్ లో వేసి నీటిని పట్టిన తర్వాత ఆ వ్యక్తి ట్యాప్ ఆఫ్ చేయలేదు. దీనికి స్పందనగా “గొప్ప ఆలోచన కానీ ట్యాప్ ఆఫ్ చేయండి” అని ఒక నెటిజన్ కామెంట్ చేసాడు. ఏది ఎలా ఉన్నా సరే కోడి గుడ్డు తొక్కను తీయడ౦ ఇంత ఈజీనా అని పలువురు ఆశ్చర్యపోతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: