పర్యావరణాన్ని ప్లాస్టిక్ భూతం ఎలా పట్టి పీడిస్తుందో అందరికి తెలిసిన విషయమే. ఈ భూమిపైన ముమ్మాటికి ఇది మనుషులు చేస్తున్న పాపమే. మనిషి చేసే మంచికంటే చెడే ఎక్కువగా ఉంది. మనుషులతో, ప్రమాదం మనుషులకే గాక, భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి హాని తలపెడుతున్నాడు.

 

 

ఇది చాలదన్నట్లుగా ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. కలుషితం చేస్తున్నాడు. వ్యర్ధ పదార్దాల విషయ వాయువులను గాల్లో వదలడమే గాక, విపరీతంగా  ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తూ భావితరాల జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాడు. ఈ ప్లాస్టిక్ తో, మనిషికే గాక, జంతువులకు, పక్షులకు కూడా హాని జరుగుతుంది. అందుకు ఉదాహరణగా ఇక్కడ ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని పేర్కొనవచ్చూ.

 

 

ఇకపోతే ఈ ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల ప్రకృతితో పాటుగా, భవిష్యత్తులో మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్‌ వల్ల మనుషులే కాదు జంతువులు, వన్యజీవులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఆహారమేదో,  ప్లాస్టికేదో గుర్తించలేక వాటిని ఆహారంగా తీసుకొని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు ఎన్నో తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ ఒక పాము అదేదో పెద్దగున్న ఆహారం తన కడుపుకు సరిపడా దొరికింది. రేపటి వరకు తిండికి ఏ లోటుండదు అని అనుకుని దాన్ని చటుక్కున మింగేసింది.

 

 

లోపలికి వెళ్లినాక అది జీర్ణం అవ్వాలి, కాని పాము కడుపులోకి వెళ్లిన ప్లాస్టిక్ గోల గోల చేస్తుంది. ఇంకే ముంది ఏదో తినకూడని వస్తువేదో తిన్నానని గ్రహించిన ఆ పాము. దాన్ని నా నా తంటాలుపడి చివరకు బయటకు తీసింది. ఇకపోతే తాజాగా ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కశ్వాన్‌ పోస్టు చేసిన  ఈ వీడియో ప్లాస్టిక్‌ భూతం వన్యజీవులకు ఎంత ప్రమాదమో చాటుతోంది. నిజంగా ఇది బాధకర విషయమే. ఎందుకంటే పాము కాబట్టి బయటకు తీయగలిగి ప్రాణాలు దక్కించుకుంది. ఇదే పని వేరే ఏ జీవి చేసిన దాని ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే ఇప్పటికైనా ముప్పు ఇంటి గడపలోకి రాకముందే ఈ ప్లాస్టిక్ విషయంలో జాగ్రత్త పడితే మంచిదని కొందరు హితబోధ చేస్తున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: