లోకంలో మనుషుల మనస్తత్వాలు రోజుకు రోజు కఠినంగా మారుతున్నాయి. పక్కవాడి ప్రాణాలు పోతున్నా, మనకేం పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు జనాలు. నీతులు చెప్పమంటే పేజీలు పేజీలు నింపుతారు, ప్రసంగాలు ఇవ్వమంటే గంటలు గంటలు ఇస్తారు. కాని కళ్ల ముందు అన్యాయం గాని దోపిడి గాని జరుగుతుందంటే గుడ్లప్పగించి చూస్తారే గాని అడ్డు తగలరు. తప్పు చేసే వాడికి భయం కలగాలంటే అన్యాయం జరిగే చోట పదిమంది తిరగబడితే మరోసారి వాడు ఆ పని ఎందుకు చేస్తాడు.

 

 

ఇకపోతే దొంగతనం చేసే దొంగలకు పూర్తిగా భయం లేకుండా పోతుందనడానికి కళ్లముందు జరుగుతున్న ఘటనలే నిదర్శనం. వాళ్ల సోమ్మేదో దాచి పెట్టినట్లుగా దర్జాగా దోచుకుంటున్నారు. ఒకప్పుడు రాత్రి సమయంలో ఎవరు లేనప్పుడు లేదా అందరు మంచి నిద్రలో ఉన్నప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి దోచుకెళ్లేవారు. కాని ఇప్పటి దొంగలు మాత్రం భయం లేకుండా మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే అనే దైర్యంతో పట్ట పగలే దోపిడిలకు పాల్పడుతున్నారు. వీరి దైర్యం ఏంటంటే దొరికిన చట్టం ఏం చేయదు, ఇక ప్రజల్లో ఐకమత్యం లేకపోవడం.

 

 

అడవిలో ఒక జంతువుల గుంపు వెళ్లుతున్నప్పుడు మరో జంతువు దాడి చేయడానికి భయపడుతుంది. కాని ఈ జనారణ్యంలో ఒక మనిషి వెళ్లేటప్పుడు అతనితో పాటుగా పదుల సంఖ్యలో బలగం ఉన్నా దోచుకునే వాడు అత్తాగారి సొమ్ములా దోచుకెళ్లుతున్నాడు.. ఇకపోతే దొంగలు ఎంతగా బరితెగించారో ఇక్కడ జరిగిన సంఘటన తాలుకూ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది.

 

 

అదేమంటే ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్‌లో ముగ్గురు దుండగలు రెచ్చిపోయారు. రోడ్డు మీద నడుచుకుని వెళ్తున్న షహన్వాజ్ అనే యువకుడి మెడపట్టుకుని అతడిని భపెట్టిస్తూ మొబైల్ ఫోన్, పర్సు ఎత్తుకెళ్లారు. పాదచారులు, వాహనదారులు చూస్తుండగానే ఈ దోపిడీ చేయడం గమనార్హం. దొంగలు ఆ యువకుడిని కిందపడేసినా ఎవరూ పట్టించుకోలేదు.

 

 

సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మనకంటే జంతువులు, పక్షులు నయం అనిపిస్తుంది. ఎందుకంటే అవి స్వార్ధం లేకుండా ఉన్నంత వరకైనా కలసి కట్టుగా ఉంటాయి. కాని మనుషులు నిండా స్వార్దం అనే మత్తులో మునిగి ఎవరికి వారు బ్రతుకుతున్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: