ఆ పాతకాలంలో దొంగలంటే పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని, గల్ల లుంగి కట్టుకుని, సమాజానికి ఎక్కడో దూరంగా అడవిలో బ్రతికే వారు. దోపిడీలు చేయవలసిన సమయం వచ్చినప్పుడు కాపుకాసి అందిన కాడికి దోచుకునే వారు. ఇక ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ఈ దోపిడీలు శతాబ్దాల కాలం నుండి జరుగుతున్నాయన్న విషయం వాస్తవం. సమాజంలోని తారతమ్యాలే ఈ దోపిడీకి ప్రేరణగా మారాయి.

 

 

ఇక పూర్వకాలంలో ధనికవర్గం ప్రజలు పేదల రక్తం పీల్చి వారి శ్రమను, సంపదను అన్యాయంగా దోచుకునే వారు. అంతే కాకుండా ఆ ఇంటి స్త్రీలను కూడా ఆక్రమించేవారు. ఇటువంటి స్దితిలో, అసహాయులైన పేద వర్గాల ప్రజలు ఇలాంటి అరాచకాలను ప్రతిఘటించలేక మౌనంగా భరిస్తూ ఉండేవారు.. క్రమ క్రమంగా జరిగే ఈ సంఘర్షణలే బలవంతంగా నైనా తమ హక్కును సాధించాలనే ఆలోచనను వారిలో కలిగించాయి.. ఇదే వారిని దోపిడీకి పురిగొల్పాయి.

 

 

కానీ ఇప్పుడు మనిషికి అన్ని హక్కులు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆలోచనలు సక్రమంగా లేక అడ్డమైన పనులకు తెగిస్తున్నాడు. ఇక ఈ కాలంలో మనుషులను చూస్తే అందులో దొంగ ఎవడో, దొర ఎవరో కనిపెట్టడం కష్టం. చూపులకు టిక్ టాక్‌గా తయారై జంటిల్‌మాన్‌లా హుందాగా, గంభీరంగా కనిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం అతని ఆలోచనలు అన్ని పేడలోని పురుగుల్లా కదులుతుంటాయి. అందుకే మన ఇంటిలోని వారే కాదు, ఇంటి చుట్టుప్రక్కలి వారితో సహా స్నేహితులను కూడా నమ్మడానికి వీలులేని పరిస్దితుల్లో ఈనాడు జీవనాన్ని సాగిస్తున్నాము.

 

 

ఇకపోతే దొంగతం చేసేవాడు అవసరమైతే ఎదుటివారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అందుకు ఉదాహరణగా ఇప్పుడు ఈ వీడియోను చూడవచ్చూ. అదేమంటే రైల్వే స్టేషన్ సమీపిస్తుందనగానే ప్రతివారు లగేజ్‌తో రైలు బోగీ డోర్ వద్దకు వెళ్లి నిలుచుంటారు. అలా చేయడం ఎంత డేంజర్ అనేది ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది.  ఈ ఘటన ఏ రైల్లో జరిగిందనేది తెలియరాలేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది... 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: