అప్పటి వరకు సామాన్యంగా ఉన్నవారు కూడా అధికారం చేతిలోకి రాగానే, ఏదో ప్రతిష్టాత్మకమైన పదవిని అలంకరిచినట్లుగా ఫీలై పోతారు. మనిషికి అధికారం అనేది అలంకారంగ ఉండాలే తప్పా, వ్యక్తిత్వాన్ని చంపుకుని అహాంకార పూరితంగా ప్రవర్తిస్తే అప్పటివరకు ఉన్న విలువ కూడా మట్టిలో కలిసిపోతుందనడానికి ఎన్నో ఉదహరణలు ఉన్నాయి. ఇకపొపతే చేతిలో ఉన్న అధికారం శాశ్వతమైందేమి కాదు. అధికారాన్ని అడ్దుపెట్టుకుని పొందాలనుకునే విలువ వ్యభిచారం చేసే మనిషితో సమానమైంది.

 

 

నీకు నువ్వుగా స్వతహాగా పొందే అభిమానం ప్రేమ, వజ్రం కంటే విలువైందని పెద్దలు చెబుతారు.. ఇకపోతే ఒక మహిళ తాను మహిళను అనే విషయం మరచి, తన చేతిలో ఉన్న అధికారాన్ని గర్వంగా మలచుకుని ఒక డాక్టర్‌ను భయపెట్టాలని చూసింది. కాని ఇక్కడొక విషయన్ని మరచింది. అహాం లేకుండా ప్రేమపూర్వకంగా మాట్లాడితే తాను చెప్పినట్టుగా ఆ డాక్టర్ వినే వాడేమో కాని అతను ఆమె మాటలను లెక్కచేయలేదు సరి కదా కనీసం విలువ కూడా ఇవ్వలేదు. ఇక ఆవివరాలు తెలుసుకుంటే..

 

 

రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమన్‌ ఘర్ లోని పిలిబంగా ఎస్‌డిఎమ్ ప్రియాంక తలానియా ఉన్నపళంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తనిఖీ చేయడానికి వెళ్ళారు. అంతవరకు బాగానే ఉంది కానీ తనిఖీ చేయాలనే పనినిమిత్తం వెళ్లినప్పుడు ఎలాగోలా పని కానిచ్చుకుని రావాలి కాని డాక్టర్ కూర్చున్న కుర్చీలోనే కూర్చోవాలనే పంతంతో ఆన్-డ్యూటీ డాక్టర్ నరేంద్ర బిష్ణోయిని ఆదేశించారు..

 

 

కానీ తాను పేషెంట్‌ను చూస్తున్నానని కావున పక్క కుర్చీ మీద కూర్చోవచ్చని అతను సూచించాడు. అయినా సరే ఆమె వెనక్కు తగ్గలేదు. వేరే కుర్చీలో కూర్చోకుండా ప్రియాంక వైద్యుడిపై అరుస్తూ, నోటి కొచ్చిన బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఉన్న కొందరు రికార్డ్ చేసారు.

 

 

ఈ వీడియోను డాక్టర్ మనీష్ కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఇకపోతే  తనిఖీ నిమిత్తం వెళ్ళిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) ప్రియాంక తలానియా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: