సప్తస్వరాలు కలిస్తేనే సంగీతం. ఈ సంగీతానికి రాళ్లను సైత కరిగించే శక్తి ఉందని, రోగాలను సైతం తగ్గించే ఔషదంగా పని చేస్తుందని అంటుంటారు. ఇకపోతే సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన వారిని అభిమానులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. తీయని స్వరం నుండి వచ్చే మధురమైన గేయంలోని భావం హృదయాంతరాలలో తిష్టవేసుకుని తన్మయంలో ముంచి వేస్తుంది. ఇలా అద్భుతంగా పాటలు పాడేవారి, రూపంతో ఎవరికి పనిలేదు.

 

 

అటువంటి అద్భుతమైన పాటలు విన్నప్పుడు కలిగే అనుభూతిని చెప్పడం చాలా కష్టం. ఇలాంటి మధురమైన గొంతు.. యాచన చేసుకుంటున్న ఓ యాచకురాల్ని సెలబ్రిటీని చేసిందన్న విషయం తెలిసిందే. ఆమె పేరు రణు మొండాల్‌.. ఈమె గాత్రానికి ముగ్ధుడైన బాలీవుడ్‌ నటుడు, సంగీత దర్శకుడు హిమేష్‌ రేష్మియా ఆమెకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలా ఆమె ప్రముఖ సింగర్‌గా మారిపోయింది..

 

 

ఇకపోతే ఇదే పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ ఆలపించాడు. ఇక్కడ విశేషమేంటంటే అతనితో పాటు ఓ కుక్క కూడా అతనితో గొంతు కలిపింది. మొరుగుతూ, అరుస్తూ కుక్క భౌమంటూ పాట అందుకుంది. అతని స్వరానికి అనుగుణంగా ఆ కుక్క తన తల అటు ఇటు ఊపుతూ తన గంభీరనమైన స్వరంతో పాటను ఆలపించింది. భౌ భౌ అని మొరిగే గొంతులో అంతకాలం దాగున్న కళను ఆ కుక్క బయట పెట్టింది.

 

 

తన పాట చూసిన చిత్రపరిశ్రమలోని వారు ఎవరైన తనకు కూడా అవకాశం కల్పిస్తారని బహుశ ఆశపడుతుంది కావచ్చని అనుకుంటున్నారట కుక్క పాడిన పాటను వింటూ స్వయంగా ఆ వీడియోను చూసిన వారు.. ఇక ఎంతగానో పాపులర్ అయినా తేరీ మేరీ సాంగ్‌తోనే దీని టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ, అంత మంచి పాటను ఖూనీ చేస్తున్న కుక్కను మెచ్చుకోవాలో కుయ్యే మొర్రో అనేదాక కర్రతో బాదాలో అర్ధం గాక  తేరీ మేరీ సాంగ్‌ ను అభిమానించే అభిమానులు తెగఫీలవుతున్నారట. ఇకపోతే ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: