ఈ సృష్టి ఒకరహస్యం అంటారు పెద్దలు. అందుకేనేమో ఎన్నో రహస్యమైన సంఘటనలు ఈ భూమిపై ఎక్కువగా జరుగుతుంటాయి.. ఇలాంటి విచిత్ర ఘటనలకు సైన్స్ ఏదో ఒక పేరుపెట్టి ఇలా జరగడానికి కారణాలు ఇవే అని చెబుతుంది. కానీ దాని మూలాన్ని మాత్రం ఎప్పుడు విడమరచి చెప్పదు. అందుకే కొన్ని రహస్యాలు, రహస్యంగానే మిగిలిపోతున్నాయి.

 

 

ఇక ఎన్నో వింతలు ఈ లోకంలో జరుగుతుండగా అవి దైవ లీలని కొందరు, పూజిస్తారు. మరిన్ని ఘటనలకు దుష్టశక్తులు కారణమని నిందిస్తారు. ఏది ఏమైన నమ్మకం అనే పునాదిమీదే ఇదంతా జరుగుతుంది. ఇకపోతే ఇప్పుడొక వింత జననం జరిగింది. ఒక మేకపిల్ల మనిషి ముఖాన్ని కలిగి జన్మించిన విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేక అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటంతో ప్రజలు దానికి పూజలు కూడా చేస్తున్నారట.

 

 

ఇంతకు ఈ వింత జరిగింది ఎక్కడంటే. రాజస్థాన్‌లోని నిమోదియాలో... ఇక  ఈ సమాచారం రాకెటంటే వేగంగా వ్యాపించడంతో, ఈ విచిత్ర మేకను చూసేందుకు ప్రజలంతా తండోపతండాలుగా తరలి వస్తున్నారట.. ఇక ఈ మేకపిల్ల ముకేష్ ప్రజాపాప్ అనే వ్యక్తికి చెందిన ఒక మేకకు జన్మించిందట.. చూడటానికి అచ్చం మేక ముఖం మనిషి ముఖాన్ని పోలి ఉండటంతో ఇప్పుడు ఇదొక సంచలన ఘటనగా మారింది..

 

 

ఇకపోతే ఈ మేక పిల్ల ముఖం మేక తరహాలో కాకుండా.. సమాంతరంగా ఉండటంతో అది మనిషి ముఖంలా కనిపిస్తోంది. ఇక ఈ మేక ఇలా జన్మించడానికి కారణాన్ని కొందరు వైద్యులు వివరించారు.. అదేమంటే ఇది ఒక జన్యు సమస్య మాత్రమేనని, సైక్లోపియా అనే సమస్య వల్ల జంతువుల ముఖంలో ఇలాంటి మార్పులు వస్తాయని, వారు  తెలుపుతున్నారు.

 

 

అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 16వేల జంతువుల్లో ఏదో ఒకదానికి ఇలాంటి సమస్య వస్తుందన్నారు. అయితే, ఇది కేవలం జంతువులకే పరిమితం కాదని, మనుషుల్లో కూడా ఇలాంటి జన్యు సంబంధమైన లోపాలు కలిగినప్పుడు విచిత్రంగా పుట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: