కుక్క విశ్వాసం గల జంతువు అంటారు కాని మరి ఇంత విశ్వాసం చూపిస్తుందనుకోలేదు. ఇకపోతే కుక్కలను పెంచుకోవడం కొందరికి చాలా ఇష్టం. కొందరైతే కుక్కలను కుటుంబసభ్యుల్లా సాకుతారు. మరికొందరైతే విడదీయరాని అనుబంధాన్ని పెంచుకుంటారు. ఇకపోతే కుక్క కుక్కే. ఇలా ఎందుకు అన్నానంటే ఒక కుక్క చేసిన పని తెలిస్తే అసలు కుక్కలంటేనే వణుకు వస్తుంది. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

పంజాబ్ జలంధర్ లో ఓ పెంపుడు కుక్క.. 15 ఏళ్ల బాలుడి పై దాడి చేసింది. ఆ దాడి మామూలుగా కూడా కాదు. బద్దశత్రువుని పట్టుకున్నట్లుగా పిక్క పట్టుకుంది. అతని పిక్కను పట్టిన కుక్క ఎంతకు ఆ బాలున్ని వదిలిపెట్టడం లేదు. చివరికి  ఆ బాలుడిని రక్షించటం కోసం చుట్టు ప్రక్కల వారు కుక్కను చితకబాదారు కూడా, అయినా.. ఆ కుక్క ఏమాత్రం భయం లేకుండా పిక్కను ఉడుంపట్టు పట్టింది. వివరాల్లోకి వెళితే.. సైకిల్ పై ట్యూషన్ వెళ్లి వస్తున్న బాలుడిని, ఇంటికి సమీపంలో ఉన్న ఓ కుక్క అకారణంగా దాడి చేసి, అతడి కాళ్ల పిక్కను గట్టిగా పట్టికుంది. అనుకోని పరిణామానికి బెదిరిపోయిన ఆ బాలుడు భయపడుతూ, హెల్ప్..హెల్ప్  అంటూ అరిచాడు.

 

 

అతని అరుపులు విన్న స్దానికులు,ఆ కుక్క బారినుండి ఆ బాలున్ని రక్షించాలని చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి. దాన్ని ఎంతలా బాదిన కానీ, ఆ కుక్క మాత్రం బాలుడి కాలును వదలలేదు. నిజంగా ఈ సీన్ చూసినవారికి కుక్క పగబడితే ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది. అసలు దానికి ఈ బాలునితో ఉన్న శత్రుత్వం ఏంటిదో తెలియదు గాని ఎన్ని తన్నులు తిన్న ససేమిరా అంటూ గట్టిగా అలాగే పట్టేసింది.

 

 

ఇక తన కొడుకును రక్షించుకోవాలని తల్లి కూడా ఎంతో ప్రయత్నించింది. కుక్కను కాళ్లతో తన్నింది. కొందరు కుక్క పై నీళ్లు పోశారు. ఇలా చాలా సేపు జరిగింది. ఎట్టకేలకు వారి ప్రయత్నం ఫలించి చివరికి, అతన్ని వదిలేసింది. కాకపోతే ఆ బాలుడి కాలికి గాయం మాత్రం తీవ్రంగా అయ్యింది.. ఒక చిన్న సంగ్రామన్ని తలపించేలా ఉన్న ఈ దృష్యాలన్ని అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: