సామాన్య మానవులకే కాదు, రక్షక భటులకు కూడా రక్షణ కరువైంది. లోకంలో రోజు రోజుకు పెరుగుతున్న అరాచకాలకు, మనుషుల్లోని హింసా ధోరణికి ఇప్పుడు మనం చూడబోయే ఘటన అద్దం పడుతుంది. మానవత్వం కనిపించని మృగాలను మనుషుల రూపాల్లో చూడటం నిజంగా నేటి కాలంలో న్యాయంగా బ్రతికే వారి దురదృష్టం అని చెప్పవచ్చూ. ఇకపోతే  ట్రాఫిక్ పోలీసు ఉద్యోగం ఎంతైనా ప్రమాదకరం. ఎందుకంటే ఉద్యోగ నిర్వహణలో భాగంగా తమ విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల ప్రాణాలకు ప్రమాదం ఏ రూపంగా ముంచుకొస్తుందో చెప్పడటం కష్టం. డ్యూటీ చేసే ప్రదేశంలో వారు ఎదుర్కొనే ఘటనలు ఒక్కోసారి వారిని చిక్కుల్లో పడవేస్తాయనడంలో సందేహం లేదు.

 

 

ఇక నిజాయితీగా వ్యవహరించే వారు ఎప్పుడు ప్రమాదం అంచునే ఉంటారనడానికి ఉదహరణగా ఇప్పుడు మనం చూడబోయే వీడియో నిరూపిస్తుంది.. ఈ వివరాలు తెలుసుకుంటే దేశ రాజధాని ఢిల్లీలోని నంగ్లోయి ప్రాంతంలో, ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న ఓ కారును ట్రాఫిక్ పోలీసు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఆగని ఆ వాహన చోదకుడు భయం లేకుండా తన కారుని ట్రాఫిక్ పోలీసు మీదికే పోనిచ్చాడు. ఆ ట్రాఫిక్ పోలీసు కారుకు అడ్దం తిరగడంతో, ఆపినట్లే ఆపి, వెంటనే మళ్లీ వేగంగా తీసుకెళ్లాడు.

 

 

దీంతో సదరు పోలీసు అధికారి కారు బానెట్ పట్టుకుని వేలాడుతూ  ఉన్నాడు.. అయినా ఆ కారు ఆపకుండా అలాగే రెండు కిలోమీటర్ల వరకు కారును పోనిచ్చాడు కారులోని వ్యక్తి.  చివరకు రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కారును ఆపడంతో సదరు ట్రాఫిక్ పోలీసు కారు దిగి అతన్ని వారించే లోపే కారులోని వ్యక్తి అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో సునీల్ అనే పోలీసు అధికారికి గాయాలయ్యాయి. కాగా, ఉదంతాన్నంత కారులో ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ ఘటన గత సంవత్సరం నవంబర్‌లో జరిగిందట.. అప్పుడు జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: