ఈ సృష్టిలో అమృతం తర్వాత అంత తీయనైనది ప్రేమ.. ఈ ప్రేమ అనేది ఎన్నిరకాలో లెక్కించడం చాలా కష్టం. కానీ నేటి కాలంలో కనుమరుగైన, కమ్మనైనా ఈ ప్రేమలు అంతా కమర్షియల్‌గా మారాయి.. ఒక మనిషితో అవసరం ఉంది అంటే అతనితో ప్రేమగా ఉంటారు. అది తీరిపోయాక చెత్తబుట్టలోని చెత్తలా దూరంగా విసిరేస్తారు.. ఇదే కాకుండా మనుషుల పై చూపించే ప్రేమలు కూడా రోజు రోజుకు తగ్గుతున్నాయి. అసలు తన ప్రాణాలను పణంగా పెట్టి, తన రక్తాన్ని పంచి, జన్మను ఇచ్చిన తల్లిదండ్రులను ఆదరించని నీచమైన సంసృతికి అలవాటు పడి బతుకుతున్నాము..

 

 

ఇలాంటి సమాజంలో ఇంట్లో పెంచుకునే జంతువులకు అన్ని సౌకర్యాలు కలిపిస్తున్నారు గానీ కన్న తల్లిదండ్రులను అనాధలుగా మార్చేస్తున్నారు.. ఇకపోతే ఎవరైన కుక్కను గాని, పిల్లిని గాని, పెంచుకుంటారు. వాటిపై ప్రేమను కురిపిస్తారు. కానీ అమ్మ అందించే అంతటి ప్రేమను మాత్రం చూపించలేరు. ఇక కొందరు పిల్లలు లేని వారు కూడా జంతువులనే తమ పిల్లలుగా భావించి కాలాన్ని వెళ్లతీస్తున్న వారు కూడా ఉన్నారు. ఇక ఫారిన్‌లో అయితే జంతువుల పేరు మీద కోట్ల ఆస్తులను పెట్టి వాటిని రాజవైభోగాలతో పెంచే వారున్నారు. కానీ ఒక సామాన్య కుటుంబం ఒక జంతువును సాదాలంటే దానికి అయ్యే ఖర్చు కూడా ఏం తక్కువగా ఉండదు..

 

 

ఇదిలా ఉండగా జంతుప్రేమికులు కూడా జంతువులను ఇంత ప్రేమగా చూడరేమో అన్నంతంగా ఒక కోతికి సకల సేవలు చేస్తూ ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియవు గానీ, ఇక్కడ ఒక మహిళ ఆ కోతిని బుజ్జగిస్తూ, లాల పోస్తుంది. అచ్చం పసి పాపలా భావిస్తూ ఆ కోతికి చేస్తున్న సేవకు ఫిదా కాని వారుండరు.. నిజంగా జంతు ప్రేమికులం అని చెప్పుకునే వారంతా జంతు ప్రేమికులు కాదు. జంతువులను ఇలా చూసుకున్న వారే నిజమైన జంతు ప్రేమికులని ఈ దృష్యాన్ని చూసిన వారు అనుకుంటున్నారట.. మరికొందరు నెటిజన్స్ అయితే ఒక జంతువు పట్ల చూపిస్తున్న ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే అంటున్నారు...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: