మనిషి బ్రతకాలంటే పంచభూతాల అవసరం తప్పని సరిగ్గా కావాలి. మనిషే కాదు ఈ భూమి మీద జీవించే ప్రతి ప్రాణి ఈ పంచభూతాలతో అనుసందానమై ఉంటుంది.. వీటి వల్లే జీవి మనుగడ, వీటి కారణంగానే ప్రాణి అంతం.. ఈ రెండు చర్యలు పంచభూతాల వల్లే జరుగుతాయన్నది సత్యం.. ఇకపోతే విమాన ప్రయాణం అంటేనే రిస్కుతో కూడుకున్నదని తెలిసిందే.. అయినా గానీ తప్పని పరిస్దితిలో తప్పక చేయవలసిందే.. ఇక ఎలాంటి పరిస్దితుల్లో అయినా ఎదురయ్యే సవాళ్లను సైతం అధిగమించి ఎంతో ధైర్యంగా విమానాలను నడుపుతారు పైలట్లు..

 

 

ఇక పైలట్లకు ఓర్పు, నేర్పు తప్పనిసరి.. అయితే విమానం నడిపే సమయంలో పైలట్లు ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్న చాల మంది ప్రాణాలు రిస్క్‌లో పడతాయి.. పైలట్ల చాకచక్యం వల్ల  ప్రమాదాల నుండి విమానాలు బయటపడిన సంఘటనలు మనకు తెలిసినవే.. ఇకపోతే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక విమానం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న దృష్యాలు కనిపిస్తాయి.. ఆ విమానాన్ని నడిపే పైలట్ చాకచక్యం వల్ల ఈ ముప్పు తప్పిందనుకోవచ్చూ.

 

 

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ ఉన్న తీవ్రమైన గాలి తుఫాన్ అంత పెద్ద విమానాన్ని పక్కకు తోసేస్తున్న ఆ పైలట్ ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ఎంతో చక్కగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు... ఇకపోతే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌ను సియరా తుఫాన్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. తుఫాన్ వల్ల విమానాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటమే కాదు, తీవ్రమైన గాలులు విమానాలకు ప్రమాదకరంగా మారాయి...

 

 

ఇలాంటి పరిస్థితుల్లో ఎంబ్రేర్ E190- ఎయిర్ బస్ A380 విమానాన్ని బర్మింగ్‌హమ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. విమానం రన్ వే మీదకు దిగకుండానే గాలి పక్కకు నెట్టివేసింది. దీంతో విమానం గాల్లో అటూ ఇటూ తిరిగింది. దీంతో పైలట్ చాకచక్యంగా విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేసి రెండోసారి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఈ వీడియోను చూసి నెటిజనులు పైలట్ నైపుణ్యానికి సలాం కొడుతున్నారు. ప్రయాణికులకు ఇది థ్రిల్లింగ్ అనుభవమని అంటున్నారు. ఇక ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్దితి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: